‘ఆసరా’ అందేది ఎన్నడో?
- 93 Views
- wadminw
- January 23, 2017
- Home Slider సంపాదకీయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు ఆసరా పేరుతో అందిస్తున్న పెన్షన్ కోసం పించన్దారులు ఎదురు చూస్తున్నారు. గత నెల 8వ తేదీన పెద్దనోట్ల రద్దు అనంతరం వారికి బ్యాంకుల్లో జమ కావాల్సిన పించన్ సొమ్ము నెల చివరి వారంలో జమ అయ్యింది. వాటిని డ్రా చేసుకునేందుకు బ్యాంకుల వద్ద ఉన్న ఏటిఎం సెంటర్లకు వెళితే కొండ చేంతాండంత బారులు తీరిని జనాన్ని చూసి ఓపికలేని వృద్దులు, వికలాంగులు, వితంతువులు లైన్ తగ్గిన తరువాత తీసుకుందాం అని వెనుతిరుగుతున్నారు.
అకౌంట్లో డబ్బులు ఉన్నా ఏటిఎంలలో 2వేల నోట్లు అందుబాటులో ఉండటంతో వారికి రావలసింది వెయ్యి రూపాయలు కావటంతో చేసిది లేక రెండవ నెల డబ్బులు వచ్చాక తీసుకోవచ్చని కాళ్లకు బుద్దిచెప్పి ఇంటితిరిగి వచ్చామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు కేవలం రెండు వందల రూపాయలని అందజేస్తుంటే స్వరాష్ట్రంలో పాలన మొదలైన నాటి నుండి రెండు వందలను కాస్తా వెయ్యి రూపాయలు చేసి అందరి ముఖాల్లో ఆనందాన్ని నింపినప్పటీ నుండి ఎంతో సంతోషంగా ఉన్నా వృద్దులు, వికలాంగులు, వితంతువులు గత నెల వారికి రావలసిన డబ్బులు రాకపోవటంతో మందులు కొనుగోలు, ఇతర ఖర్చులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని, డబ్బులకోసం రెండు ముడు సార్లు ఏటిఎం సెంట్ల వద్దకుపోతే సాప్ట్వేర్ అప్డేట్ చేయాలని కొన్నిరోజులు మూసి వుంచారు.
తెరిచిన తరువాత రెండు వేల రూపాయల నోట్లు వస్తున్నాయని , వందలు వచ్చే ఏటిఎంల వద్ద చూస్తే లైన్లు కిలో మీటర్ల మేరకు పేరుకుపోవటంతో అంత సేపు లైన్లలో ఉండే ఓపిక లేక ఇంటికి చేరుకుంటున్నామని, ఆసరా పించన్ దారులకోసం బ్యాంకులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సేవలందిస్తే ఎంతో ఉపయోగంగాఉంటుందని పించన్దారులు అంటున్నారు. బ్యాంకుల వద్ద బారులు తీరిన క్యూలను చూస్తుంటే పసి పిల్లలతో వచ్చే వారికి, వృద్దులకు, వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయటం లేకపోతే వారికి ప్రత్యేక లైన్ల ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.
ఐదు వారాలు గడిచినా బ్యాంకు వద్ద బారులు తీరుతున్న ప్రజలను చూస్తుంటే ప్రజలపై ఇంకా నగదు రహిత బ్యాంకు లావాదేవీలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు ఈ ప్రచారాల్లో విఫలం అవుతున్నారని తెలుస్తుంది. ఒకటి అన్ని దుకాణాల్లో స్వైపింగ్ మిషన్లుఏర్పాటు చేస్తే బ్యాంకుల వద్ద ఇంత క్యూ ఉందడని ప్రజలు అంటున్నారు. అధికారులు ఏదో ఒక పటిష్టమైన చర్యలు తీసుకొని బ్యాంకుల వద్దకు ప్రజలు ఇంత భారీ మొత్తంలో రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


