ఆస్ట్రేలియా హైకమీషనర్‌తో ఏయూ వీసీ గొల్లపల్లి భేటీ
- 89 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు భారత దేశానికి ఆస్ట్రేలియా హైకమీషనర్ హరిందర్ సిద్దును మర్యాద పూర్వకంగా కలిసారు. ఎయిర్‌పోర్ట్‌లో పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం వీసీ నాగేశ్వరరావు బోధన, పరిశోధన, సేవల రంగాలలో సాధిస్తున్న ప్రగతిని వివరించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అత్యుత్తమంగా వర్సిటీ పనిచేస్తోందని తెలిపారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియా సంయుక్తంగా కలసి పనిచేయడానికి అనువైన అంశాలను వివరించారు. ఇరు దేశాల మధ్య సంయుక్తంగా పరిశోధన, విద్యా సంబంధ కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన జరపాలన్నారు. కార్యక్రమంలో ఏయూ అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య బి.మోహన వెంకటరామ్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలు వలన మానసిక ఉల్లాసం: ఏయూ వీసీ నాగేశ్వరరావు
విశాఖపట్నం, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): క్రీడలు వలన మనసిక ఉల్లాసం చేకూరుతుందని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి. నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఏయూ గోల్డెన్ జూబ్లీ క్రీడామైధానంలో ఏయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజి టీచర్స్ క్రీకెట్ మ్యాచ్ ను వీసీ జి. నాగేశ్వరరావు ముఖ్యఅతిథి గా పాల్గోని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అన్ని కళాశాలలు సంబందించి అంతర కళాశాలల క్రీడల పోటీలు విద్యార్థులకు, నాన్ టీచింగ్, టీచింగ్ కు నిర్వహిస్తామన్నారు. ఈసందర్భంగా క్రీకెట్ బ్యాటింగ్ చేసి పోటీలను వీసీ ఆచార్యనాగేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య వి. ఉమామహేశ్వరరావు ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఏయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజి ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్, ఏయూ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ అసోసియేట్ డైరెక్టర్ ఆచార్య ఎన్. విజయమోహన్, కోచ్‌లు డాక్టర్ రత్నాకర్, డాక్టర్ జి.ఎస్. వర్మ,, డాక్టర్ ఆర్.ఎస్ వర్మ,, సీనియర్ టైపిస్ట్ సారధి, వివిధ విభాగాలకు చెందిన ఆచార్యస్త్రలు పాల్గోన్నారు. కాగా, ఇటీ వల జరిగిన ఆల్ ఇండియా వెయిట్ లిప్టింగ్ పోటీల్లో వి. చిన్ననాయుడు 56 కిలోల విభాగంలో మూడవ స్థానానం సాదించారు. వర్సిటి తరపున ఆరువేల రూపాయలు చెక్కును ఏయూ వీసీ ఆచార్య జి. నాగేశ్వరరావు అందజేశారు. ఈపోటీలు నాగార్జున యూనివర్సిటిలో జరిగాయి. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి. ఉమామహేశ్వరరావు, ఏయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి. రామన్, ఏయూ వ్యాయామ విద్యా విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఆచార్య ఎన్ విజయమోహన్, డాక్టర్ రత్నకల్, డాక్టర్ జి.ఎస్ వర్మ, డాక్టర్ ఆర్. ఎస్. వర్మ, తదితరులు పాల్గోన్నారు. కాగా, ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు మంగళవారం ఉదయం ఏయూలోని పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం అర్ధశాస్త్ర విభాగం, ఇంజనీరింగ్ కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాలను తనిఖీ చేశారు. అధ్యాపకులు, సిబ్బంది, పరిశోధకుల హాజరుపట్టికలను పరిశీలించారు. విద్యార్థులు తరగతులకు హాజరవుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. తనగతుల నిర్వహన పటిష్టంగా జరపాలని సూచించారు. ప్రతీ విభాగంలో పూర్తిస్థాయిలో తరగతులు జరగాలని తెలిపారు.
బెస్ట్ అకడమీషియన్ అవార్డులు ప్రథానం: ఏయూ వీసీ
విశాఖపట్నం, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రతీ సంవత్సరం అందజేసే సర్వేపల్లి రాధాకృష్ణ బెస్ట్ అకడమీషియన్ అవార్డులు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం ఏయూ సెనేట్ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అవార్డులను ప్రథానం చేశారు. ఆచార్య వి.శ్రీదేవి, ఆచార్య గార లచ్చన్న, వై.రాజేంద్రప్రసాద్‌లు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ఆచార్య శ్రీదేవి, గార లచ్చన్నలకు అవార్డులను అందించి అభినందించారు. వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ గత సంవత్సరం ఆచార్యులు చూపిన ప్రగతి ఆధారంగా ఈ అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే అవార్డులలో ఏయూ ఆచార్యులు ఎనిమిది మంది అవార్డులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆచార్యులు కాలానుగుణంగా అవార్డులకు దరఖాస్తు చేయాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, ప్రిన్సిపాల్స్ ఆచార్య సి.వి రామన్, కె.గాయత్రీ దేవి, ఇంఛార్జి ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.ఎస్ ప్రసాదబాబు, డీన్స్, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.


