ఆహారోత్పత్తులపై పరిశోధనలకు గుర్తింపు
- 77 Views
- wadminw
- December 21, 2016
- అంతర్జాతీయం
ఆహారోత్పత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న ‘ఫంగస్ డిసీజస్’పై విస్తృతమైన పరిశోధనలు చేసి వాటి నివారణకు అనేక మందులను అభివృద్ధి చేసిన ఘనత మన తెలుగుతేజానిది. ఇంతకు ముందు చర్మరోగాల నియంత్రణకు ‘ఫ్లూరో మ్యుచులిస్’ అనే మందును కనుగొని అంతర్జాతీయ స్థాయిలో సీనియర్ సైంటిస్టు అవార్డును కైవసం చేసుకున్నారు. శాస్త్రవేత్తగా ఎదిగి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఈ యువశాస్త్రవేత్తది గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రంథసిరి.. తాజాగా ‘టాలెంటెడ్ ఇండస్టీయ్రల్ బయోటెక్నాలజీ అవార్డు-2016’కు ఎంపికయ్యారు. అసోసియేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఫార్మసీ (ఏబీఏపీ) సంస్థ ఈ అవార్డును అతనికి అందజేయనుంది.
ఆ సంస్థ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 21 నుంచి మూడు రోజుల పాటు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగే అంతర్జాతీయ శాస్త్రవేత్తల సదస్సులో అతనికి అవార్డు కింద బంగారుపతకాన్ని బహుకరించనుంది. అంతర్జాతీయ స్థాయిలో ఇంతకు ముందు సీనియర్ సైంటిస్టు అవార్డు, బంగారు పతకం అవార్డులు దక్కించుకోగా తిరిగి మరోసారి బంగారు పతకం అవార్డుకు ఎంపికై అంతర్జాతీయంగా ఖ్యాతి గడించటంపై జన్మభూమిలో హర్షం వ్యక్తమవుతోంది.


