ఇంటర్నెట్ వినియోగంలో అప్రమత్తత
- 75 Views
- wadminw
- December 21, 2016
- అంతర్జాతీయం
అంతర్జాలం వినియోగం తప్పనిసరి అవుతున్న క్రమంలో మెయిళ్లు, చరవాణుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని మచిలీపట్నం ఎస్వీహెచ్ ఇంజినీరింగు కళాశాలకు చెందిన ఐటీ ప్రొఫెసర్ ధీరజ్ హెచ్చరించారు. మానవ వనరుల అభివృద్ధి సంస్థ (హెచ్ఆర్డి) జిల్లా శిక్షణ కేంద్రం (మచిలీపట్నం) ఆధ్వర్యంలో ఆయుష్ కళాశాల ప్రొఫెసర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, పశువైద్యులు, తహసీల్దార్లు, ఉపతహసీల్దార్లు సుమారు 90 మందికి నగరంలోని ఉపకలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో సైబర్ నేరాలను నిరోధించే దిశగా మంగళవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఎంఈఐ నంబరు పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఏటీఎంలలో నగదు పొందే విషయంలో వినియోగించే ‘పిన్’ నంబరును రహస్యంగా ఉంచాలన్నారు. మెయిలు వాడకం పూర్తయిన తర్వాత సైన్అవుట్లోకి రావలన్నారు. ట్యాంపరింగు, హ్యకింగు వంటి విషయాలను గమనించాలని సూచించారు. కంప్యూటర్లు తదితరాల్లో వైరస్ నివారణకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాల్య దశ నుంచే కంప్యూటర్లు వినియోగిస్తున్న క్రమంలో 12 నుంచి 17 ఏళ్ల వయస్సున్న చిన్నారులు ప్రభావాలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. మచిలీపట్నం శిక్షణ కేంద్ర సమన్వయకర్త ఎం.ఎస్.ప్రకాశరావు పర్యవేక్షణలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.


