ఇంటింటికి తాగునీరు అందించాలన్నదే భగీరథ లక్ష్యం: కేటీఆర్
- 66 Views
- wadminw
- December 22, 2016
- రాష్ట్రీయం
ఇంటింటికి తాగునీరు అందించాలన్నదే మిషన్ భగీరథ లక్ష్యనమి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనసభలో మిషన్ కాకతీయపై స్వల్పకాలిక చర్చ ముగింపు సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇంటింటికి తాగునీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు. గొప్ప ఆలోచనల వెనుక తీవ్ర గాయాలున్నాయనేద పెద్దల మాట అని అన్నారు.
నల్లగొండ జిల్లా పక్కనే కృష్ణా నది ఉన్నా.. పరిశుభ్రమైన నీళ్లు లేవన్నారు. బురద నీటినే తాగు నీటిగా వాడతున్న దుర్భర పరిస్థితి నెలకొందని తెలిపారు. దాదాపు 2 లక్షల మంది జీవచ్చవాలుగా మారిన దుస్థితి నెలకొందని అన్నారు. సత్వరమే న్యాయం జరగాలనే ఉద్దేశంతో సీఎం ముందుకు వస్తున్నారని స్పష్టం చేశారు. సురక్షితమైన మంచినీటి విషయంలో 122 దేశాల ర్యాంకింగ్స్‌ను ఐక్యరాజ్య సమితి విడుదల చేసిందని తెలిపారు. ఐరాస విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భాతర 120వ స్థానంలో ఉందన్నారు.
ఈ దుస్థితి నెలకొవడానికి 67 ఏళ్లు దేశాన్ని పాలించామని చెప్పుకునే నేతలే కారణమన్నారు. గతంలో పాలించిన నాయకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత పాలకులు తాగునీటిని కనీస మానవ అవసరంగా గుర్తించలేదన్నారు. గుర్తించిన వారిపై అనవసరపు విమర్శలు చేస్తున్నారు. దేశంలని 254 జిల్లాల్లో భూగర్బ జలాలు వ్యవసాయానికి పనికి రాకుండా ఉన్నాయని చెప్పారు. గతంలో తెచ్చిన 164 సిడబ్ల్యూ పథకాల్లో చాలా పని చేయడం లేదన్నారు.
రాష్ట్రానికి కేటాయించిన 1200 టీఎంసీల్లో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటామని వెల్లడించారు. కాకతీయులు గొలుసు కుట్ట చెరువులు నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. వరదలు, వర్షాలు వచ్చినప్పుడు భవిష్యత్తులో ఆ నీరు ఉపయోగించేందుకు రిజర్వాయర్లు నిర్మిస్తుంటే కొత్తగా రిజ్వాయర్లు ఎందుకుని నిర్మిస్తున్నారని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. చరిత్ర సృష్టించాలన్నా.. చరిత్ర తిరగరాయలన్నా.. ధృడ చిత్తం ఉన్న నాయకుడు కావాలన్నారు. ఈ ప్రభుత్వం పాదర్శకత.. జవాబుదారీతనంతో ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానానికి ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందన్నారు. మిషన్ భగీరథ టెండర్లు పారద్శకంగా టెండర్లు పాదర్శకంగా జరిగాయన్నారు. ఎక్కడా కూడా అవినీతి జరగలేదని స్పష్టం చేశారు.


