ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల హత్యలు ప్రమాదాలు
- 22 Views
- admin
- February 1, 2023
- జాతీయం తాజా వార్తలు
ఉత్తరాఖండ్ మంత్రి గణేశ్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బలిదానం గాంధీ కుటుంబ గుత్తాధిపత్యం కాదని, ఇందిర, రాజీవ్ హత్యలు ప్రమాదాలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదాలకు, బలిదానాలకు మధ్య వ్యత్యాసం ఉందని గణేశ్ జోషి వివరించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో భగత్‌సింగ్, సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్ వంటివారి బలిదానాలు జరిగాయని అన్నారు. . జమ్మూకశ్మీర్‌లో రాహుల్ గాంధీ యాత్ర సజావుగా ముగియడం ప్రధాని మోదీ ఘనతేనని కితాబునిచ్చారు. ఆర్టికల్ 370ని కనుక ప్రధాని మోదీ రద్దు చేయకపోయి ఉంటే జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు ఉండేవే కావని, అప్పుడు శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో రాహుల్ జాతీయ పతాకాన్ని ఎగరవేయగలిగి ఉండేవారే కాదని మంత్రి అన్నారు.
Categories

Recent Posts

