ఇక ఎల్ఈడీ వెలుగుల ‘గ్రేటర్’ సిటీ
- 62 Views
- wadminw
- October 4, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, అక్టోబబర్ 4 (న్యూస్టైమ్): వచ్చే సంక్రాంతి నాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని వీధి దీపాలకు ఎల్ఈడీ వెలుగులు నింపాలని పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పట్టణాల్లో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుపై జీహెచ్ఎంసీ మేయర్, పురపాలకశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు, ఈఎస్ఎస్ఎల్ సంస్థ ఎండీ సౌరభ్కుమార్ తదితరులతో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. గత మూడు నెలల్లో నాలుగున్నర లక్షల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు.
ప్రక్రియను మరింత వేగం చేయాలన్న కేటీఆర్… ఈఎస్ఎస్ఎల్ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో మొత్తం వీధి దీపాలను ఎల్ఈడీ బల్బులతో మార్చాలని.. ముఖ్యంగా అన్ని కార్పొరేషన్లలో వీధి దీపాలు ఏర్పాటును వెంటనే పరిశీలించాలని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం నాలుగున్నర లక్షల వీధి దీపాల స్థానంలో సంక్రాంతిలోగా ఎల్ఈడీ బల్బులను బిగించాలని మంత్రి ఆదేశించారు.


