ఇక దృష్టి అంతా అభివృద్ధిపైనే
- 79 Views
- wadminw
- December 15, 2016
- రాష్ట్రీయం
నెల్లూరు, డిసెంబర్ 14 (న్యూస్టైమ్): దాదాపుగా వర్షాకాలం ముగిసి, మృగశిర కార్తే ప్రారంభం కావడంతో పెండింగ్ ప్రాజెక్టులపై నెల్లూరు జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది. 15 నుండి ధనుర్మాసం ప్రారంభం అవుతుండగా పకృతి ప్రకోపిస్తే తప్ప వర్షాలు పడడం అసాధ్యం. డిసెంబర్ నెలాఖరు నుంచి ప్రారంభమైన వేసవిని దృష్టిలో ఉంచుకుని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
2017 నుంచే ఎలక్షన్ వాతావరణం జిల్లాలో నెలకొని ఉంది. పెద్ద నోట్లు రద్దుతో దేశంలో ఏర్పడిన రాజకీయ అన్శిస్థితిని ప్రస్తుతం ఏన్డీయే ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లు, నోట్ల రద్దుతో వ్యక్తమవుతున్న మిశ్రమ స్పందన తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాదే బీజేపీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు అధికంగా నిధులు విడుదల చేయాలని టీడీపీ కేంద్రాన్ని కోరడంతో అందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో సోమశిల్ల, కండలేరు, కలిగిరి నెల్లూరు సంగం ఆనకట్ట వంటి వాటిని వెంటనే ప్రారంభించనున్నారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా తడ, సూళ్లూరుపేట, నాయుడుపేటల్లో వెలిసిన ప్రత్యేక ఆర్థిక మండళ్లలో పరిశ్రమలను మరిన్ని ఏర్పాటు చేయడానికి జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈ సంరద్బంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ అభివృద్ధి పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
యువత ఓట్లను ఆకర్శించేందుకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 2015లో, 2017 ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయ గ్రాడ్యువేట్ స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో టీడీపీ పోటి చేస్తోంది. ఆ విజయాలు త్వరలో జరిగే సాధారణ ఎన్నికలకు సోమానాలని మంత్రి అన్నారు.


