ఉత్తుత్తి ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్న సీఎం జగన్…
- 72 Views
- admin
- November 8, 2022
- తాజా వార్తలు రాష్ట్రీయం
ఉత్తుత్తి ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్న సీఎం జగన్… జల్ జీవన్ మిషన్ లెక్కలనూ టాంపరింగ్ చేశారని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ ఆరోపించారు. తప్పుడు లెక్కలు, రాష్ట్రంలోని 3,544 గ్రామాలకు 100 శాతం కుళాయి కనెక్షన్ ఇచ్చినట్లు లెక్కలు చూపారన్న సత్యకుమార్.. 735 (20.74%) గ్రామ పంచాయతీల్లో మాత్రమే పని పూర్తి చేశారన్నారు. మిగిలిన 80.26% మోసమేనని ఆయన ఆరోపించారు. ఇలాంటి తప్పుడు లెక్కలు చూపించడంలో జగన్ సిద్ధ హస్తుడన్న బీజేపీ నేత.. ఇలాంటి సలహాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా 45 మంది సలహాదారులను పెట్టుకొని వారికి రూ.130 కోట్లు ఖర్చు పెట్టారంటూ దుయ్యబట్టారు. తప్పుడు ప్రచారం చేస్తూనే జగన్ మూడున్నరేళ్ల పాటు పాలన సాగిం చారని ఆరోపించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి రక్షిత మంచి నీటిని అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్లో ఏపీ ఆశించిన ఫలితాలను సాధించడంలో ఘోరంగా విఫలమైనట్లు వై.సత్యకుమార్ ఆరోపించారు. ఏపీలో ఈ పథకం అమలు అధ్వాన్నంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని వంద శాతం మేర అమలు చేశామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిందన్న సత్య కుమార్… వాస్తవంగా ఏపీలో కేవలం 20 శాతం గ్రామాలకు మాత్రమే ఈ పథకం ఫలాలు అందాయని అన్నారు.


