‘ఎడ్యురాండ్’ ర్యాంకింగ్లో ఏయూకు ప్రథమ స్థానం
- 86 Views
- wadminw
- September 7, 2016
- తాజా వార్తలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 7 (న్యూస్టైమ్): ఎడ్యురాండ్ ర్యాంకింగ్స్2016లో ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల అత్యుత్తమ స్థానాన్ని అందుకుంది. ఆంధ్రప్రదేశ్లోని ఇంజనీరింగ్ విద్యను అందించే కళాశాలల విభాగంలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను కలిగి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సాధించింది. ఎడ్యురాండ్ సంస్థ ఈ మేరకు ఆంధ్రవిశ్వవిద్యాలయానికి సమాచారం పంపింది. ఈ మేరకు వివరాలను ఏయూ వీసీ ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు వెల్లడించారు.
భారత్కు చెందిన ఇడియు, అమెరికాకు
చెందిన రాండ్ కొర్పొరేషన్ సంయుక్తంగా ఈ ర్యాంకింగ్లను అందించాయి. నమ్మకమైన, నిస్సాక్షికమైన సమాచారాన్ని విద్యార్థులు అందించే ఉద్దేశంతో విభిన్న దశలలో పరిశీలించి ర్యాంకులను విడుదల చేశాయి. ఇంజనీరింగ్ విద్య ప్రధానంగా చేసుకుని విశ్లేషించి, సంస్థ సామర్థ్యాలు పరిశీలించి గత కొన్ని సంవత్సరాలుగా సాగిస్తున్నప్రగతిని బేరీజు వేస్తూ ఈ ర్యాకింగ్లను అందించారు.ఎడ్యురాండ్ వ్యాప్తంగా 800 కళాశాలలను పరిశీలించింది. బోధనజరిపే అద్యాపకుల విద్యార్హతలు, పరిశ్రమ అవసరాలకు విద్యార్థులు సిద్దం చేసే విధానం, పరిశోధన ఉత్పాదకత, కళాశాల ప్రవేశాలకు ఉండే డిమాండ్(గిరాకీ) వంటి అంశాలను క్షున్నంగా పరిశీలించింది.
వీటిని సమగ్ర విశ్లేషణ జరిపి విభిన్న దశల్లో సమాచారాన్ని సేకరించి నిస్సాక్షికంగా ర్యాంకులను కేటాయించారు. కోర్సులు, బోధన సిబ్బంది, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలలో ప్రత్యేకంగా మార్కులను అందించింది. ఉపాధి కల్పనలో 6, పరిశోధనలో 6, బోధన సిబ్బందికి 9 పాయింట్లు ఏయూ సాధించింది. భవిష్యత్తులో సైతం ఇదే విధమైన మెరుగైన ప్రగతిని సాధించాలని సూచించింది.


