ఎన్టీఆర్‌లో ఆ ఉత్సాహం ఇంకా ఉందా?
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం జనతాగ్యారేజ్. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన టాక్స్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్నాయి. పూర్తి కమర్షియల్ చిత్రంగా వచ్చిన జనతాగ్యారేజ్ మూవీపై అభిమానులు పెట్టుకున్న ఆశలు సజీవంగానే ఉన్నాయనేది ఈ మూవీ రిజల్ట్స్‌ని చూస్తే తెలుస్తుంది. రిలీజ్‌కి ముందు అభిమానులకి ఎన్టీఆర్ ఏ విధమైనా హామీ ఇచ్చాడో ఇఫ్పుడు రిలీజ్ తరువాత కూడా అదే నిజం అని అభిమానులు అంటున్నారు. అయితే డైరెక్టర్ కొరటాల శివ తన గత రెండు సినిమాల కంటే ఈ మూవీలో కథపై అంతగా శ్రద్ధ చూపలేదనేది ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్స్. ఈ విషయంలో ఎన్టీఆర్ సైతం రిలీజ్ అనంతరం తెలుసుకున్నాడని కొందరు అంటున్నారు.
జనతా గ్యారెజ్ సినిమా ఎన్టీఆర్‌కి మంచి సక్సెస్ ఇచ్చినప్పటికీ కొరటాల శివ గతంలో తెరకెక్కించిన మిర్చి, శ్రీమంతుడు మూవీలకి వచ్చినంత సౌండ్ జనతాగ్యారేజ్‌కి రాలేకపోయింది. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ రెండు చిత్రాల కంటే జనతాగ్యారేజ్ చిత్రం మొదటి స్థానంలో ఉంటుందని అభిప్రాయపడ్డాడంట. అందులోనూ డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ మీద ప్రత్యేక అభిమానంతో ఈ సినిమాని తెరకెక్కించారు కనుక ఇది కచ్ఛితంగా బ్లాక్ బస్టర్‌ని కొట్టడం ఖాయం అని భావించారు.
కానీ తాజాగా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం రిలీజ్‌కి ముందు కొరటాల శివపై ఉన్న అభిప్రాయం ఇప్పుడు రిలీజ్ తరువాత ఎన్టీఆర్‌కి మారిందని అంటున్నారు. ఈ మూవీ 100 కోట్ల రూపాయల క్లబ్లో జాయిన్ అవుతుందనుకున్న ఎన్టీఆర్‌కి ప్రస్తుతం కొంత నిరాశనే మిగిల్చిందని అంటున్నారు. సినిమా సక్సెస్ అయినప్పటికీ అనుకున్నంత స్థాయిలో కాలేకపోయిందనేది ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న కొందరి వాదన. ముఖ్యంగా ఇది ఎన్టీఆర్‌కి భారీ కమర్షియల్ సక్సెస్‌ని ఇవ్వలేకపోవచ్చు అని అంటున్నారు.


