ఎన్‌కౌంటర్‌పై కౌంటర్ దాఖలకు హైకోర్టు ఆదేశం
తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు కొత్త ఐపీఎస్‌లు
హైదరాబాద్, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): నగరంలోని జాతీయ పోలీస్ అకాడమిలో శిక్షణ పొందుతున్న 124 మంది ఐపీఎస్‌ల శిక్షణా కాలం ముగిసింది. ఈ నెల 28 వ తేదిన జరిగే దీక్షాంత్ పరేడ్ (పాసింగ్ అవుట్)కు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రానున్నట్లు అకాడమి డెరైక్టర్ అరుణ బహుగుణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా శిక్షణ పూర్తైన ఐపీఎస్‌లలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఏడుగురిని కేటాయించారు. ఏపీకి కేటాయించిన నలుగురిలో ఇద్దరు ఏపీ వారే కాగా, తెలంగాణకు కేటాయించిన ముగ్గురిలో ఒకరు మాత్రం తెలంగాణ చెందినవారు. అజిత వెజెండ్ల(ఏపీ), గౌతమి సాలి(ఏపీ), ఆరిఫ్ హఫీజ్(కర్ణాటక), బరుణ్ పురకాయస్త(అస్సాం)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. ఇక, తెలంగాణకు కేటాయించిన వారిలో, చేతన మైలమత్తుల(తెలంగాణ), రక్షిత కె. మూర్తి(కర్ణాటక), పాటిల్ సంగ్రామం సింగ్ గణపతి రావు(మహారాష్ట్ర) ఉన్నారు.
జగన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం!
హైదరాబాద్, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూల్ నుంచి రోడ్డు మార్గంలో కారులో కాన్వాయ్‌తోపాటు హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పాల్మాకుల వద్ద కారు టైరు పంక్చర్ అయింది. వేగంగా వస్తున్న కారు రోడ్డు పక్కకు వెళ్లిపోవడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే నిలిపేశాడు. భద్రతా సిబ్బంది కాన్వాయ్‌లో నుంచి దిగి జగన్‌కు రక్షణగా చుట్టూ నిలబడ్డారు. కారు టైరు మార్చిన తర్వాత అందులోనే హైదరాబాద్‌కు బయలుదేరారు. జగన్ 20 నిమిషాలపాటు రోడ్డుపైనే వేచి ఉండడంతో భద్రతా సిబ్బంది అక్కడికి ఎవరినీ రానీయలేదు.
ఎన్‌కౌంటర్‌పై కౌంటర్ దాఖలకు హైకోర్టు ఆదేశం
మృతుల బంధువులతో కలిసి ఘటనా స్థలిని సందర్శించిన విరసం నేతలు
హైదరాబాద్, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తదుపరి విచారణను ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ పరిధి దాటి వెళ్లి ఒడిశాలో కాల్పులు జరిపారని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. ఏకపక్షంగా దాడి చేసి ఎన్‌కౌంటర్‌గా చీత్రీకరించాలరని ఆయన ఆరోపించారు. దీనిపై తదుపరి విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్‌కు పలు ప్రశ్నలు సంధించింది. పోలీసులు ఎలా పరిధి దాటి వెళ్తారని ప్రశ్నించింది. పోలీసులకు పరిధిలు ఉంటాయా? అని సందేహం వ్యక్తం చేసింది. ఏదీ ఏమైనా ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా ఏవోబీలో ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయస్టుల మృతదేహాలను వారి బంధువులను అప్పగించడంలో పోలీసులు అనుచిత వైఖరి ప్రదర్శిస్తున్నారని విరసం నేతలు, మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు కాల్పులలో మరణించిన కానిస్టేబుల్ అబూబకర్ మృతదేహాన్ని విశాఖపట్టణానికి చేర్చిన పోలీసులు మావోయిస్టుల మృతదేహాలు ఆసుపత్రికి ఎందుకు తరలించలేదని విరసం నేత వరవరరావు తదితరులు ప్రశ్నించారు. మృతదేహాలను చూపకుండా కేవలం ఫోటోలు చూపుతూ మృతులను గుర్తించాలని పోలీసులు అంటున్నారన్న దానిపై వాగ్వాదానికి దిగారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను ఒడిశాలోని మల్కన్‌గిరికి తరలించిన విషయం విధితమే. విరసం నేతలతో కలిసి మృతుల బంధువులు మల్కన్‌గిరికి చేరుకుని పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మరోవైపు, దశాబ్దాల నుంచి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) మావోరుుస్టులకు కీలక స్థావరంగా ఉంది. గణపతి, రామకష్ణ, నంబాల కేశవరావు వంటి మావోరుుస్టు అగ్రనేతలు ఏవోబీలో మకాం వేసి కీలక సమావేశాలు నిర్వహించేవారు. దళసభ్యులకు సేప్టీజోన్గా ఏవోబీని ఏర్పరుచుకుని పార్టీని బలోపేతం చేస్తూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. పార్టీలో ఈ ప్రాంతానికి చెందిన వారు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఏవోబీలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఏవోబీలో విస్తతంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు చిక్కకుండా పైచేరుుగా కార్యకలాపాలు సాగిస్తున్న మావోరుుస్టు పార్టీకి ఈ ఏడాది ఊహించని విఘాతం కలిగింది. చింతపల్లి ప్రాంతానికి చెందిన మావోరుుస్టు కీలకనేత సెంట్రల్ రీజన్ కమిటీ కమాండర్ కుడుముల వెంకటరమణ అలియాస్ రవి ఏప్రిల్ 9న అనారోగ్యంతో మతి చెందాడు. మే 5న కొయ్యూరు మండలం మర్రిపాకలు ఎదురుకాల్పుల్లో గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి ఆజాద్‌తోపాటు మరో ఇద్దరు మావోరుుస్టులు మతి చెందారు. ఇటీవల జీకేవీధి మండలం చీపురుగొంది అటవీ ప్రాంతంలో గాలికొండ ఏరియా కమిటీకి చెందిన నర్సింగ్, ఆంబ్రి అనే ఇద్దరు మావోరుుస్టులు పోలీసులకు పట్టుబడ్డారు. వరుస ఘటనలతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న మావోరుుస్టు పార్టీకి ఇప్పుడు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. భీకరమైన ఎదురుకాల్పుల్లో ముఖ్యనేతలతో సహా 24 మందిని పోలీసులు మట్టుబెట్టడంతో, ఇన్నాళ్లూ తిరుగులేని ఆధిపత్యంతో ఏవోబీని గడగడలాడించిన మావోరుుస్ట్ పార్టీ తుడిచిపెట్టుకుపోరుునట్టే కనిపిస్తోంది. ఏళ్ల కిందట అనకాపల్లి, చోడవరం పోలీస్ స్టేషన్‌పై మావోరుుస్టు పార్టీ నిర్వహించిన దాడికి సూత్రధారిగా వ్యవహరించిన నాయకుడు చలపతి ఈ ఎదురుకాల్పుల్లో మతి చెందారు. ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా చిరకాలం నుంచి మావోరుుస్టు పార్టీ కార్యకలాపాలకు మార్గదర్శకం వహిస్తూ ఏవోబీలో కీలకనేతగా వ్యవహరిస్తున్నారు. ఏవోబీలో కూంబింగ్ ముగించుకుని 2008 జూన్ 29న లాంచీలో విశాఖ వస్తున్న 36 మంది గ్రేహౌండ్స కమాండెట్లపై మా వోరుుస్టులు దాడి చేశారు. వారంతా జలసమాధి అయ్యారు. లాంచీలో నుంచి మ తదేహాలను తీసేందుకు చేపట్టిన ఆపరేషన్ వారానికి పైగానే నడచింది. నాటి నుంచి మావోరుుస్టుల ఏరివేతలో ఒడిశా సహకారం లేదని ఏపీ జాయింట్ కూంబింగ్‌ను నిలిపివేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక కేంద్ర హోం మంత్రి రాజనాధ్‌సింగ్ రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంత ఉమ్మడి కూంబింగ్ తిరిగి పుంజుకుంది. మావోరుుస్టులను ఎదుర్కోవడంలో దేశంలోనే అత్యుత్తమ శిక్షణ పొందిన గ్రేహౌండ్స బలగాలే మావోరుుస్టులపై ఎదురు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌తో విశాఖ మన్యం వణుకుతోంది. సహచరులను కోల్పోరుున మావోరుుస్టులు ఎలాంటి విధ్వంసాలకై నా పాల్పడే వీలుంది. ఈమేరకు పోలీసులు అప్రమత్తం మయ్యారు. రాజకీయ పార్టీల నేతలను అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది. మావోరుుస్టులు సంఖ్య పరంగా బలహీనపడ్డా ఉనికి కోసం ఏదైనా చేసే అవకాశం ఉందని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు, ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కానీ, అరుణ కానీ లేరని, ఆర్కే కుమారుడు మున్నా మాత్రం ఎన్కౌంటర్లో మరణించినట్లు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో, విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు. కూంబింగ్‌కు వెళ్లిన పోలీసు బలగాలకు తారసపడిన మావోయిస్టులను లొంగిపోవాల్సిందిగా హెచ్చరించినప్పటికీ వారు వినకుండా కాల్పులు ప్రారంభించారని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురుకాల్పులు జరపడం వల్ల ఇంతమంది చనిపోయారని చెప్పారు. మల్కన్‌గిరి ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్కౌంటర్లో కొందరు తీవ్రంగా గాయపడి తప్పించుకు పారిపోయారన్నారు. ఒక్కరు కూడా తమకు లొంగిపోలేదని పేర్కొన్నారు. బూటకపు ఎన్కౌంటర్ ఎంతమాత్రం కాదన్నారు. చట్టప్రకారం, ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం మృతదేహాలను 72 గంటల పాటు భద్రపరుస్తామని, మృతుల సంబంధీకులు వస్తే అప్పగిస్తామని చెప్పారు. విజయనగరంలో ఉంటున్న మురళి కుటుంబ సభ్యులు మాత్రమే ఇప్పటికవరకు తమను ఫోన్లో సంప్రదించారని, మృతదేహాన్ని తీసుకువెళతామని చెప్పారని తెలిపారు. కాగా ఏవోబీ ఎన్కౌంటర్ ఘటనలో మొత్తం 28మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.


