ఎస్కేడీయూ విద్యార్థులపై సప్పెన్షన్ ఎత్తి వేయాలని డిమాండు
- 91 Views
- wadminw
- September 21, 2016
- రాష్ట్రీయం
విశాఖపట్నం, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్ధి సంఘమైన వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 10న జరిగిన బంద్, ఆ తర్వాత వివిధ ఆందోళనలు నిర్వహించారని, ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసే కుట్రల భాగంగా వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి, మరో ఇద్దరు విద్యార్థి నాయకులను యూనివర్శిటీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని యూనియన్ నేత బి.కాంతారావు ఆరోపించారు.
ఆరోజు బంద్‌కు సహకరించిన శ్రీక్రిష్ణ దేవరాయ యూనివర్శిటీ ఉద్యోగుల్లో 72 మంది ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. దీన్ని నిరసిస్తూ తమ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఆంధ్రాయూనివర్శిటీలో నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. కాంతారావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఉద్యమానికి సహకరించాలని యూనివర్శిటీ, ప్రభుత్వాలు ఈ విధంగా ఉద్యమాన్ని అణచివేయాలనుకోవడం సమంజసం కాదని ప్రశ్నించే హక్కు లేకుండా రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రహక్కును కూనీ చేసి గొంతు నొక్కుతున్నారని అన్నారు.
యస్.కె.డి యూనివర్శిటీలోని విద్యార్థుల సస్పెండ్‌ను వేంటనే ఎత్తివేయాలని లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. కాంతారావు రాష్ట్ర కార్యదర్శి బి. మోహన్‌బాబు, టి.సురేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి కె.ధీరజ్ నాయకులు బి. జోగారావు, హరీష్, రాధా, అనిల్, చంద్ర, నవీన్‌బాబు, సూర్యచందర్, రమణ, విశేష్, ప్రణీత్ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


