ఏపీలో సామాజిక భద్రత పెన్షన్‌దారులకు ఊరట
- 70 Views
- wadminw
- December 22, 2016
- రాష్ట్రీయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షన్‌దారులకు ఊరట లభించింది. బ్యాంకుల నుంచి వారికి నగదు విత్‌డ్రా పరిమితిని ఎత్తివేస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రెండు రోజులుగా ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్బీఐ అధికారులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపారు. ఇబ్బందులను ఆయన వారికి వివరించి చెప్పారు.
ఫలితంగా ఆర్బీఐ నుంచి సానుకూల ప్రకటన వచ్చింది. పెన్షన్‌కు అవసరమైన నగదు విత్‌డ్రాకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్బీఐ కల్పించిన వెసులుబాటను ఉపయోగించుకోవాలిన కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
Categories

Recent Posts

