ఏపీ సీఎం దయవల్ల విదేశీ చదువు!
- 59 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
విజయవాడ, అక్టోబర్ 25 (న్యూస్టైమ్): ‘‘తండ్రి నన్ను చదివించటానికి ఒక్కపూట భోజనం చేశారు’’ అని అమెరికాలో ఎంఎస్ చేయటానికి ఎంపిక అయిన మౌలాలి అనే విద్యార్థి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో చెప్పాడు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో 194 మంది ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణ కింద ఎంపికైనా విద్యార్ధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక తండ్రి తన కొడుకు కోసం పడే తపన మన సంస్కతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని, అదే అమెరికాలో అయితే ఇంటర్ విద్య అభ్యసించిన తరువాత ఆ విద్యార్ధిని బయటకు పంపి నీవే సంపాదించి చదువుకోవాలంటారని చెప్పారు.
అది మన సంస్కతి సంప్రదాయలకు నిదర్శనమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ద్వారా 2016-17 సంవత్సరమునకు గాను విదేశాలలో ఉన్నత విద్యను అందించటానికి 194 మందిని ఎంపిక చేయటం జరిగింది. విదేశీ విద్యావిధానం ద్వారా అమెరికా వెళుతున్న మౌలాలి తండ్రి లాంటి వారు చాలా మంది మన రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణ పధకం తీసుకొచ్చామని,దీనిని ఉపయోగించుకొని విద్యారులు ఆర్థికంగా ముందుకు వెళ్లాలని తెలిపారు.
వెనుకబడిన తరగతుల వారు రాష్ట్రంలో బాగా వెనుకబడి ఉన్నారని, వారిని ఆర్థికంగా పైకి తీసుకు రావటానిక అనేక పథకాలు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. వీరి ఆర్థిక పరిస్థితి అంతంతగా ఉన్న మూలంగా ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి పథకాలను కూడా అందుకోలేక పోతున్నారని తెలిపారు. ఎవరైనా బీసీ కులాలలో పై చదువులు చదువుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నవారికి చేయూత అందించాలని తెలిపారు. కుల వృత్తులకు ఆదరణ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అనేక పధకాలు ప్రవేశపెట్టినటు ముఖ్యమంత్రి చెప్పారు.
వెనుకబడిన ඩී.බී. కులాల కోసం బీసీ సబ్-ప్లాన్ బడ్జెట్ను 8832 కోట్లకు పెంచామన్నారు. బీసీ కులాలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకురావటానికి 11 బీసీ కార్పొరేషను ఏర్పాటు చేశామని తెలిపారు. బీసీ విద్యార్ధులకు సివిల్ సర్వీసెస్లో క్రోచింగ్ ఇవ్వటానికి, స్కిల్ డెవలెపమెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించటానికి అవకాశాలు కల్పించినట్టు చెప్పారు. విద్యార్థులు జీవితంలో స్థిరపడటానికి ఎంతైనా చేస్తామని, ప్రభుత్వం కూడా విద్యారులకు సహకరిస్తుందని తెలిపారు.
ఇలాంటి పథకాలను విద్యారులు ఉపయోగించుకొని ఆర్థికంగా స్థిరపడి నలుగురు విద్యారులకు సహకరించాలని తెలిపారు. రాష్ట్రంలో 4 కోట్ల మంది కి 5 కేజీల బియ్యం ఇస్తున్నామని, 2 కోట్ల మందికి చంద్రన్న బీమా అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల్లో భాగంగా 44 లక్షల మందికి పెనను ఇస్తున్నటు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పేదలు అందరినీ ఆదుకుంటామని చెప్పారు. ඩ්බ්න విద్యారుల కోసం వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేయనున్నట్లు చెప్పారు.
విదేశాల్లో చదువుకోసం వెళుతున్న విద్యారులు మన సంసృతిని, సంప్రదాయాలను, మనమూలాలను మరువకూడదని తెలిపారు. ఈ సందర్భంగా విదేశాలకు చదువుకోసం వెళుతున్న విద్యార్ధులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొలు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత, బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అనంత రాములు, డైరెక్టర్ హర్షవర్ధన్ రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్పలతో పాటు ఎన్టీఆర్ విద్యాధరణకు ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.


