ఏపీ సీనియర్స్ నెట్‌బాల్ విజేత కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా నెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు శాతవాహన కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 3వ అంతర్ జిల్లాల సీనియర్స్ నెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా స్త్రీ, పురుషుల జట్లు ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాయి. మంగళవారం సాయంత్రం జరిగిన పురుషుల ఫైనల్ మ్యాచ్‌లో కృష్ణా జట్టు 19-7 స్కోర్ తేడాతో ప్రకాశం జట్టుపై, మహిళల ఫైనల్ మ్యాచ్‌లో కృష్ణా జట్టు 23-15 స్కోర్ తేడాతో పశ్చిమ గోదావరి జట్టుపై విజయం సాధించాయి.
పురుషుల విభాగంలో నెల్లూరు జట్టు మూడో స్థానంలో నిలవగా, మహిళల విభాగంలో నెల్లూరు, ప్రకాశం జట్లు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. ముగింపు సభకు కళాశాల పాలక మండలి అధ్యక్షుడు కొమ్మారెడ్డి రవి ముఖ్యఅతిథిగా హాజరవగా కృష్ణా వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపల్ ఎస్‌ఎన్‌శర్మ, వ్యాయామ విద్యా సంచాలకుడు బీసీహెచ్ సంగీతరావు, జిల్లా, రాష్ట్ర నెట్‌బాల్ సంఘం కార్యదర్శి బి.శివరామ్ పర్యవేక్షించారు.


