ఏలూరులో సావిత్రి పూలెకు ఘన నివాళి
- 100 Views
- wadminw
- January 4, 2017
- Home Slider స్థానికం
మహిళలంతా చదువుకోవాలని స్త్రీ విద్యను ప్రోత్సహించి దేశంలో మొట్టమొదట స్త్రీ విద్యావ్యాప్తికి కృషి చేసిన స్వర్గీయ సావిత్రి జ్యోతిరావుపూలె ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్సీ రాము సూర్యారావు అన్నారు. సావిత్రి పూలె జయంతి సందర్భంగా మంగళవారం స్ధానిక జిల్లా పరిషత్తు కార్యాలయం వద్ద సావిత్రి పూలె విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించడానికి జ్యోతీరావు పూలె చేసిన కృషి ఎంతో ఉన్నదని ఆయన చెప్పారు.
సావిత్రి జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని ప్రతీ మహిళా విద్యావంతురాలు కావాలని అప్పుడే ఆశించిన ప్రగతి సాధ్యపడుతుందని మహిళలు వంటింటికి పరిమితం కారాదని అభివృద్ధిలో మహిళలు భాగస్వాములు అయినప్పుడే సమాజం అన్నీ రంగాలలో ప్రగతి సాధిస్తుందని సావిత్రి పూలే నిరూపించారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు ఆనంద్, వీరభద్రరావు, తదితరులు పాల్గొన్నారు.


