ఏవోబీలో మళ్లీ మావోయిస్టుల అలజడి
- 83 Views
- wadminw
- January 23, 2017
- Home Slider జాతీయం
విశాఖపట్నం: ఆంధ్రా, ఓడిశా సరిహద్దులో (ఏవోబీ)లో మళ్లీ మావోయిస్టుల అలజడి చలరేగింది. ఇటీవల ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్పై మావోయిస్టులు పోస్టుమార్టం చేస్తున్నారు. ఏవోబీలో జరిగిన నష్టానికి కోవర్టులే కారణమని మావోయిస్టులు నిర్దారణకు వచ్చారు. ఇందు కోసం ఇన్ఫార్మర్లను గుర్తించేందుకు గిరిజన గ్రామాలలో మావోయిస్టుల ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
ఏవోబీలో దారుణం జరిగిందని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు కోవర్టులను ఈ ఘటనకు కారణంగా మావోయిస్టులు గుర్తించారు. కోవర్టుల సహాయంతోనే ఎన్కౌంటర్కు రెండు రోజులు ముందుగానే పోలీసులు అడవిలోకి వచ్చారని మావోయిస్టులు గుర్తించారు. అగ్రనేత ఆర్కే, గణేష్ లక్ష్యంగానే పోలీసులు వేట సాగించారని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ దారుణానికి కారణంగా భావిస్తున్న ముగ్గురు కోవర్టులలో ఉప సర్పంచ్ని మావోయిస్టులు ఇప్పటికే కాల్చి చంపారు. మరో ఇద్దరు కోవర్టుల కోసం మావోయిస్టు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.


