ఏవోబీ ఎదరు కాల్పులతో అప్రమత్తమైన అడవుల జిల్లా
- 62 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
ఆదిలాబాద్, అక్టోబర్ 25 (న్యూస్టైమ్): ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం వేడెక్కింది. ఈ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయస్టులు మృతి చెందడంతో ఇందులో జిల్లాకు చెందిన వారు ఉన్నారా అనే విషయంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు మావోయిస్టులకు కోటగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా క్రమేటి వారి ప్రాభల్యం తగ్గుతూ వచ్చింది. ఇటీవల మావోయిస్టుల కదలికలు తిరిగి ప్రారంభం కావడతో జిల్లా పోలీసులు అప్రమత్తమై కూబింగ్ నిర్వహించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మహారాష్ట్ర, చత్తీస్గఢ్ ష్ట్రాలకు సరిహద్దుల్లో ఉండడంతో ఆ రాష్ట్రాలలో ఎలాంటి సంఘటలు జరిగిన తలదాచుకునేందుకు ఆదిలాబాద్ జిల్లాలో వస్తారని ప్రచారం ఉంది. సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మావోయిస్టు నేతలు పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్కౌంటర్తో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు ఎదురు కాల్పుల్లో మృతి చెందిన వారిని గుర్తుపట్టే కార్యక్రమం కొనసాగుతుండడంతో జిల్లాకు చెందిన వారు ఉంటారా అన్న ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. ఈ ఎదురు కాల్పుల సంఘటనతో జిల్లాకు చెందిన కీలక నాయకులు మరింత ఆత్మరక్షణ కోసం ఇతర ప్రాంతాలకు తరలి పోవడంతో జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉండవన్న ప్రచారం జరుగుతోంది.


