ఐపీఎల్‌తో సానియా బీజీ
- 41 Views
- admin
- April 25, 2023
- ఆటలు తాజా వార్తలు
ఈద్ రోజున ఇద్దరం కలిసి ఉంటే బాగుండేది. కానీ సానియా ఐపీఎల్లో షోలతో బిజీగా ఉంది. ఆ కమిట్మెంట్స్ కారణంగానే ఆమె రాలేకపోయిందని పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ తెలిపాడు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ జంట విడిపోతోందంటూ ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. వారిద్దరూ విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. పాకిస్థాన్‌కు చెందిన ‘జియో న్యూస్’ కార్యక్రమం ‘స్కోర్’లో యాంకర్ అడిగిన ప్రశ్నకు షోయబ్ బదులిస్తూ.. మేం ఎప్పుడూ ప్రేమను పంచుకుంటూ ఉంటాం. ఆమెను నేను చాలా కోల్పోతున్నా. మా బంధంపై నేను చెప్పగలిగేది ఇంతే’’ అని మాలిక్ పేర్కొన్నాడు. రూమర్లను తాము పట్టించుకోబోమని, అందుకే ఆమె కానీ, తాను కానీ వాటిపై ఇప్పటి వరకు స్పందించలేదని షోయబ్ అన్నాడు. తాము విడిపోతున్నట్టు వస్తున్న వార్తలు ఒట్టివేనని తేల్చి చెప్పాడు.


