ఐసీయూ నుంచి స్పెషల్ వార్డుకు సుష్మా తరలింపు
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కోలుకుంటున్నారు. రెండు రోజుల క్రితం (శనివారం) ఆరుగంటల పాటు డాక్టర్ ముకుత్ మింజ్, డాక్టర్ బన్సాల్ ఆధ్వర్యంలో 50 మంది వైద్యులు, సిబ్బంది విజయవంతంగా ఆమెకు కిడ్నీ శస్త్రచికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే.
అనంతరం ఆమె కోలుకుంటుండడంతో ఆమెను ఐసీయూ నుంచి ప్రత్యేకవార్డుకు తరలించారు. ఆమెను వారం పదిరోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎంసి మిశ్రా తెలిపారు. కిడ్నీ దాత అయిన మహిలను కూడా త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వారు తెలిపారు.
Categories

Recent Posts

