ఒకే వ్యక్తికి కొవిడ్, హెచ్ఐవీ మంకీపాక్స్
- 117 Views
- admin
- August 25, 2022
- Health & Beauty అంతర్జాతీయం తాజా వార్తలు
‘జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్’లో ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. ఈ తరహా కేసు నమోదవ్వడం మెడికల్ హిస్టరీలో ఇదే తొలిసారి. ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి కరోనా, మంకీపాక్స్, హెచ్ఐవీ ఒకేసారి నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు బాధిత వ్యక్తి స్పెయిన్ పర్యటనకు వెళ్లొచ్చిన 9 రోజుల తర్వాత అతడిలో గొంతునొప్పి, అలసట, తలనొప్పి, గజ్జ భాగంలో వాపు లక్షణాలు కనిపించాయి. లక్షణాలు కనిపించిన 3 రోజుల తర్వాత పరీక్ష చేయించుకోగా అతడికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. దాదాపు వారంరోజుల చికిత్స తర్వాత బాధిత పేషెంట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్చి అయ్యాడు. శరీరంపై చిన్న మచ్చలు అక్కడక్కడా ఉన్నప్పటికీ కొవిడ్, మంకీపాక్స్ నుంచి అతడు కోలుకున్నాడు. దీంతో హెచ్ఐవీకి సంబంధించిన చికిత్స కూడా ప్రారంభమైంది. మంకీపాక్స్, కొవిడ్-19 ఒకేసారి సోకే అవకాశం ఉందని ఈ కేసు ద్వారా నిర్ధారణ అయ్యిందని ఆగస్టు 19న ప్రచురితమైన ‘జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్’ రిపోర్ట్ పేర్కొంది. రెండు వైరస్‌లూ ఒకేసారి సంక్రమిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈ కేసు ద్వారా తెలియవచ్చిందని, సరైన రీతిలో వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వైద్య నిపుణులు సూచించారు. అయితే అతడిలో కొవిడ్ లక్షణాలతోపాటు ముఖం, ఇతర శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడ్డాయి. ఆ తర్వాత పొక్కులు కూడా వచ్చాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో బాధిత వ్యక్తి హాస్పిటల్‌కు వెళ్లి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అడ్మిట్ అయ్యాడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ విభాగం నుంచి అంటువ్యాధుల యూనిట్‌కు మార్చారు. ఆసనము చుట్టూ సహా ఒళ్లంతా మచ్చలు, పొక్కులతోపాటు ఇతర లక్షణాలు కూడా ఉండడంతో పరీక్షలు నిర్వహించగా మంకీపాక్స్, హెచ్ఐవీ నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌కి సంబంధించి ఒమైక్రాన్ సబ్-వేరియెంట్ బీఏ.5.1 బాధపడుతున్నట్టు తేలింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బాధిత వ్యక్తి 2 డోసుల ఫైజర్స్ టీకా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తీసుకున్నాడు.


