ఓటీటీ షోకు ఎన్టీఆర్ హోస్టింగ్ ?
- 57 Views
- admin
- May 9, 2023
- తాజా వార్తలు సినిమా
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌తో యంగ్ టైగర్ బిజీగా ఉన్నాడు. మరోవైపు తారక్ కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఒక ఓటీటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడనేదే ఆ వార్త. ఈటీవీ విన్ ఓటీటీ ఛానల్ లో ఈ షో ప్రసారం అవుతుందని సమాచారం. ఈ షోను హోస్ట్ చేయాలని కోరుతూ ఈటీవీ ప్రతినిధులు తారక్ ను సంప్రదించారని చెపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్’ సూపర్ హిట్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. డైరెక్ట్ బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు తారక్ రెడీ అవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
Categories

Recent Posts

