కట్టడాల నాణ్యతను నిరంతరం పర్యవేక్షణ: ఏయూ వీసీ
- 81 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
అబూబకర్ కుంటుంబానిక రూ. 40 లక్షల పరిహారం
విశాఖపట్నం, అక్టోబర్ 25 (న్యూస్టైమ్): ఆంధ్రా, ఓడిశా సరిహద్దులో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టుల కాల్పులకు బలైనా గ్రేహౌండ్స్ కమాండర్ అబూబకర్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఎక్స్గ్రేషియాను అందించింది. మంగళవారంనాడు డీజీపీ నండూరు సాంబశివరావు రూ. 40 లక్షల చెక్కును ప్రత్యేక పరిహారంగా ఆయన కుటంబానికి అందించారు. ఆయన కుటుంబానికి పోలీస్ శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. అసాంఘిక శక్తుల ఆగడాలు అరికట్టడంలో అమరులై పోలీసుల కుటుంబాల త్యాగాలను తమ శాఖ ఎన్నటికి మరిచిపోదని అన్నారు. అబూబకర్్ సభ్యులన పరామర్శించారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 28 మంది మరణించారని ఆయన తెలిపారు. మంగళవారం కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారని అన్నారు.
విశాఖపట్నం, అక్టోబర్ 25 (న్యూస్టైమ్): కట్టడాల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఉదయం ఏయూ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు ‘రీసెంట్ అడ్వాన్సెస్ ఆన్ స్ట్రక్చరల్ హెల్త్ మోనిటరింగ్’ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెన్సార్ల సహాయంతో భారీ కట్టడాలోని స్వల్ప మార్పులను గుర్తించడం వీలవుతుందన్నారు.
తద్వారా వీటిని మరమ్మత్తులు జరిపి సంరక్షించే దిశగా పనిచేయడం సాధ్యపడుతుందన్నారు. సక్రమ నిర్వహణ ఫలితంగా పెను ప్రమాదాలను నివారించగలమన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.ఎస్ అవధాని మాట్లాడుతూ వర్తమాన అంశాలపై కాలానుగుణంగా సదస్సుల నిర్వహణ జరుపుతున్నామన్నారు. ప్రతీ విభాగం నుంచి నూతనంగా అభివృద్ది చెందుతున్న అంశాలపై విస్తృత చర్చలు, ప్రసంగాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఐజిసిఏఆర్ కల్పకం ఎన్డిఇ విబాగాధిపతి డాక్టర్ బి.పూర్ణ చంద్రరావు, విబాగాధిపతి ఆచార్య పి.ప్రమీల దేవి, సదస్సు సమన్వయకర్త ఆచార్య పి.శ్రీనివాసరావు, ఆచార్య కె.రాంజీ, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి.సుబ్రహ్మణ్యం సి.హెచ్ రత్నం, కె.వెంకట సుబ్బయ్య, ఎస్.కె బట్టి,ఆర్.మధు సూధన్ తదితరులు పాల్గొన్నారు. విభాగ ఆచార్యులు, పరిశోధకులు,ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
విద్యార్థులే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేయాలి: ఏయూ వీసీ
విశాఖపట్నం, అక్టోబర్ 25 (న్యూస్టైమ్): విద్యార్థులే ప్రథమ ప్రాధాన్యంగా వర్సిటీ అధికారులు పనిచేయాలని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఉదయం ఏయూలో వివిధ విభాగాలకు నూతనంగా నియమితులైన డీన్లు మర్యాదరపూర్వకంగా ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావును కలిసారు. వీసీకి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ నాగేశ్వర రావు మాట్లాడుతూ సమర్ధ, సత్వర సేవలు అందించే దిశగా పనిచేయాలని సూచించారు. అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ అభివృద్దికి అవసరమైన ప్రణాళికలు తయారు చేసి, అమలు జరపాలన్నారు. విద్యార్థుల అవసరాలు గుర్తించి తగిన వసతుల కల్పన చేయాలన్నారు. విద్యార్థుల సంక్షేమమే ప్రధమ లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పూర్తిస్థాయిలో పనిచేయాలని సూచించారు. సిబ్బంది, అధికారులతో సమన్వయం జరుపుతూ పూర్తి స్థాయిలో అవసరమైన సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో మీడియా రిలేషన్స్ డీన్ ఆచార్య పి.బాబి వర్థన్, సిడిసి డీన్ ఆచార్య పి.హరిప్రకాష్, ప్రవేశాల సంచాలకులు ఆచార్య కె.రాజేంద్ర ప్రసాద్, డీన్లు ఆచార్య కె.వెంకట సుబ్బయ్య, టి.వి క్రిష్ణ, జి.సుధాకర్, కె.చంద్రమౌళి, టి.రాఘవరావు, సిహెచ్ అప్పారావు, డి.పుల్లారావు, చిట్టి బాబు, నానాజీ రావు, మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు.


