కట్నంగా 11 పాములు
- 88 Views
- admin
- October 20, 2022
- జాతీయం తాజా వార్తలు
కట్నంగా పాములే ఇస్తుంటారు ..సవ్రా సామాజిక వర్గానికి చెందిన ప్రజలు. ఛత్తీస్‌గఢ్‌లోని కోబ్రా జిల్లాలో సొహగ్‌పూర్ అనేది చిన్న మారుమూల గ్రామం. అక్కడ వారికి ప్రధాన జీవనాధారం పాములేనట. పాములతో విన్యాసాలు చేస్తూ.. భిక్షాటన చేయడం ద్వారా వచ్చే డబ్బులతో జీవితాన్ని గడుపుతారట. అందువల్లే ఆ సామాజిక వర్గానికి చెందిన వధువు కుటుంబ సభ్యులు.. వరుడికి కట్నం కింద పాములను ఇవ్వడం ఆనవాయితీగా మారిందట. అయితే వన్యప్రాణుల సంరక్షణ చట్టం ద్వారా ఈ తెగ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారట. రేషన్ కార్డులు వచ్చినప్పటికీ.. ప్రభుత్వ పథకాలు మాత్రం అందటం లేదట. అందుకే ఇప్పటికీ పాములను నమ్ముకునే.. భిక్షాటన చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారట. వధువు కుటుంబ సభ్యులు వరుడికి పాములను కట్నంగా ఇవ్వనిదే ఇక్కడ పెళ్లిళ్లు జరగవట. గతంలో కట్నం కింద వరుడికి వధువు కుటుంబ సభ్యులు.. 21 పాములను అప్పగించే వారట. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య 11 తగ్గిందట. దీనికి కారణం వన్యప్రాణుల సంరక్షణ చట్టం. ఫారెస్ట్ అధికారులు ఈ చట్టాన్ని కఠినంగా అమలు పరుస్తున్నందున.. సవ్రా సామాజిక వర్గం ప్రజలకు పాములు పట్టడం కష్టంగా మారిందట.


