కల్యాణ మండపానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
విజయనగరం, డిసెంబర్ 14 (న్యూస్టైమ్): ఆధ్యాత్మికతా భావనల పెంపుదలకు టిటిడి కృషి చేస్తుందని ఎస్.కోట శాసనసభ్యురాలు, టిటిడి బోర్డు సభ్యురాలు కోళ్ల లలితకుమారి అన్నారు. బుధవారం జిల్లాలోని లక్కవరపుకోట మండలంలోని లింగంపేటలో పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కల్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో టిటిడి సహకారంతో మరిన్ని నిర్మాణపనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
Categories

Recent Posts

