కాంగ్రెస్కు ప్రధాని మోదీ అభినందనలు
కర్ణాటక ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు అని, బీజేపీ కార్యకర్తల కృషిని అభినందిస్తున్నానని, రాబోయే కాలంలో మరింత శక్తితో కర్ణాటకకు సేవ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 136, బీజేపీ 65, జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు నేపథ్యంలో ప్రధాని ఆ పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి నా శుభాకాంక్షలు.’ అని ట్వీట్ చేశారు. అలాగే బీజేపీకి మద్దతుగా నిలిచి వారికి కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు.
Categories

Recent Posts

