కాంగ్రెస్ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన పార్టీ: రఘువీరా
- 75 Views
- wadminw
- December 15, 2016
- రాష్ట్రీయం
గుంటూరు, డిసెంబర్ 14 (న్యూస్‌టైమ్): దేశంలోని భిన్న కులాలు, మతాలు, జాతుల భావాలను గౌరవించటమే కాంగ్రెస్ పార్టీ గొప్ప సంస్కృతి అని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ భవన్లో బుధవారం కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడితే పేద వర్గాలకు ఇబ్బందులోస్తాయన్నారు. పేదవర్గాల ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పటిష్టంగా ఉండాలన్నారు. చంద్రబాబుకు నిజాయితీ ఉంటే దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయంలోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూక్రీస్తు చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. సమావేశంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు పద్మశ్రీ, మల్లిక, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఆలీఖాన్, ఉపాధ్యక్షులు చంద్రపాల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


