కాకినాడ సెజ్ ప్రాంతంలో రైతులు ఆందోళన
- 94 Views
- wadminw
- January 4, 2017
- Home Slider స్థానికం
కాకినాడ సెజ్ ప్రాంతంలో రైతులు మరోమారు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించకుండా పనులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో కొత్తపల్లి మండలం, కొత్తమూలపేటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల ఆందోళన దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు. కొత్తమూలపేట భూముల్లో కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, బొమ్మల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి మూడు రోజుల క్రితం శంకుస్థాపన చేశారు.
తమ భూములు తీసుకుని పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకుండా మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి రైతుకు 3 లక్షలు ఇచ్చి పరిశ్రమలు పెట్టే వారి వద్ద 70 లక్షల వరకు వసూలు చేస్తున్నారని రైతులు మండి పడుతున్నారు. అంతే కాకుండా ఒక ఎకరా భూమిని బ్యాంకులో తనఖా ప్టిె ప్రభుత్వం 25 లక్షల లోను తీసుకుంటూ రైతులను మోసం చేస్తోందని విమర్శిస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ రైతులను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. పరిహారం ఇవ్వకుండా పనులు ప్రారంభిస్తే గతంలో జరిగిన ఆందోళనను చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు.


