కాబోయే వధువుకు సహజసిద్ధమైన చర్మసౌందర్యం
- 98 Views
- wadminw
- January 9, 2017
- Home Slider సినిమా
సాంప్రదాయ భారతీయ వివాహ వేడుకలో ఎన్నో ఆచారాలున్నాయి. అటువంటి ఆచారాలలో హల్దీ సెరెమనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాబోయే వధువుకు వివిధ రకాల సహజసిద్ధమైన పదార్థాల కలయికతో పసుపుకు ప్రాధాన్యమిస్తూ తయారయిన అబ్టాన్ అనే ఫేస్ ప్యాక్‌తో నలుగు పెడతారు. వివాహ సందర్భంగా వధువు చర్మాన్ని కాంతివంతంగా తయారుచేయడానికి ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది. ట్యాన్‌ను తొలగించి చర్మపు రంగుకు నిగారింపును తీసుకువస్తుంది. ఒక్కసారి ఈ మిశ్రమాన్ని అప్లై చేస్తే చాలు ఎన్నో బెనిఫిట్స్ కనిపిస్తాయి. మరి ఇంత అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఈ ఫేస్ ప్యాక్‌ను రెగ్యులర్‌గా అప్లై చేస్తే కలిగే లాభాలను ఊహించండి మరి.
సాధారణంగా చాలా మంది ఫెయిర్‌గా మెరిసే చర్మ సౌందర్యాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు. అందుకు మార్కెట్లో వివిధ రకాలైన బ్యూటీ ప్రొడక్ట్ అందుబాటులో ఉన్నాయి. అవి మీ చర్మాన్ని కొన్ని వారల్లో ఫెయిర్‌గా మార్చుతాయని హామీ ఇస్తుంటారు. అయితే అవేవీ పనిచేయవు. మనందరమూ ఫెయిర్ స్కిన్ పొందాలని కోరుకుంటాం. అందుకు కెమికల్స్‌తో తయారు చేసిన ఖరీదైన ఫెయిర్ నెస్ క్రీమ్స్ కోసం పర్స్ ఖాలీ చేసుకోవడం కంటే, కొన్ని హోం రెమడీస్తో నేచురల్ పద్దతులను ఉపయోగించి మీ చర్మం ఫెయిర్‌గా, మెరిసేలా మార్చుకోవచ్చు. ఈ హోం రెమడీస్ మీ రెగ్యులర్ స్కిన్ కేర్‌లో చేర్చుకోవచ్చు.
మీ చర్మ ఛాయను మెరుగుపరుచుకోవడానికి వివిధ రకాల హోం రెమడీస్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు నిమ్మరసం. ఇది మీ చర్మాన్ని శుభ్రపరుచుటకు, చర్మ ఛాయను మార్చడానికి బాగా సహాయపడుతుంది. ఫేస్ ప్యాక్స్ అప్లై చేయడంతో పాటు, హెల్తీ డైట్‌ను ఫాలో చేయడం చాలా అవసరం. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడానికి, శరీరాన్ని శుభ్రం చేయడానికి ఫైబర్, నీటి శాతం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ఇవి కూడా చర్మం ఛాయను మార్చడంలో బాగా సహాయపడుతాయి.
మీరు ఫెయిర్ నెస్ స్కిన్ పొందాలని కోరుకుంటున్నట్లైతే ముందు మీరు ఈ చిట్కాను మీరు ఖచ్చితంగా అనుసరించాలి. ఎండలో ఎక్కువగా తిగరకుండా ఉండు, ఒక వేళ తప్పనిసరి వెళ్ళాల్సి వస్తే, ఫుల్ స్లీవ్ డ్రెస్సును ధరించడం వల్ల మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు. నేచురల్ ఎక్స్ఫ్లోయేషన్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగిస్తుంది. డార్క్ స్కిన్ తొలగించి ఫెయిర్ స్కిన్ పొందడానికి ఇది ఒక ఉత్తమ మార్గం. నిమ్మరసం నల్లగా ఉన్న చర్మాన్ని తెల్లగా మార్చడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.
నిమ్మరసంలో ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల, ఇది నేచురల్ ఎక్స్ఫ్లోయేట్గా సహాయపడుతుంది. బంగాళదుంప మరో ఉత్తమ హోం రెమెడీ. బంగాళదుంప రసాన్ని లేదా గుజ్జును మీ సున్నిత చర్మానికి సురక్షితంగా అప్లై చేసి, ఫెయిర్ స్కిన్ పొందవచ్చు. పసుపు ఒక గొప్ప నేచురల్ పదార్థం. మీ శరీరం మీద ఉండే డార్క్ కంప్లెక్షన్ నేచురల్‌గా నివారిస్తుంది. అదే విధంగా ఆలివ్ ఆయిల్ లేదా బేబీ ఆయిల్‌తో పసుపు మిక్స్ చేసి అప్లై చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది.
కలబందలో ఆంథ్రోక్వినోన్ అనే కంటెంట్ ఉండటం వల్ల ఇది చర్మాన్ని తేలికపరుస్తుంది. నలుపును నివారించి, తెల్లగా మార్చుతుంది. కొబ్బరి నీళ్ళలో స్మూతింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది డార్క్ కాంప్లెక్షన్ను తొలగించి ఫెయిర్ స్కిన్ నేచురల్‌గా పొందేలా చేస్తుంది. ఈ ట్రిక్‌ను అనుసరించడానికి ఎక్కువ సమయం కాదు, కానీ ఫలితం చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. తేనె, నిమ్మరసం డార్క్ స్కిన్‌ను ఫెయిర్‌గా మార్చే ఒక బెస్ట్ కాంబినేషన్. ఈ రెండు పదార్థాల కాంబినేషన్ స్కిన్ టోన్‌ను చాలా ఎఫెక్టివ్‌గా మెరుగుపరుస్తుంది.
ఓట్ మీల్ చాలా సమర్థవంతమైనదని ఎవ్వరికీ తెలియదు. ఎటువంటి సందేహం లేదు. ఇది మిమ్మల్ని స్లిమ్‌గా మార్చుతుంది కానీ, డార్క్ కంప్లెక్షన్ను మార్చి, తెల్లగా మార్చే బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఓట్ మీల్ మాస్క్‌కు పసుపు చేర్చి మాస్క్ వేసుకుంటే, మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. బొప్పాయి ఫెయిర్ నెస్ పెంచడంలో చాటా గ్రేట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఇందులో పెపైన్ అనే ఎంజైమ్ స్కిన్ ఎక్స్ఫ్లోయేట్ చేస్తుంది. కొత్త చర్మ కణాలను కూడా ఉత్పత్తి చేస్తుంది.
మీ శరీరానికి పెరుగును మర్ధన చేసినప్పుడు, మీ స్కిన్ కంప్లెక్షన్ చాలా త్వరగా మార్చుతుంది. ఎందుకంటే పెరుగులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్స్, నిధానంగా స్కిన్ ఎక్స్ఫ్లోయేట్ చేస్తుంది, స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది. రోజ్ వాటర్ చర్మ ఛాయను మార్చే సామర్థ్యం రోజ్ వాటర్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంలోని ఎటువంటి మార్క్ అయినా తొలగిస్తుంది. డార్క్ సర్కిల్స్‌ను నివారిస్తుంది. శెనగపిండి చిట్కా పురాతన కాలం నుండి మనక తెలిసిన ఒక ఉత్తమ హోం రెమెడీ. మన ఇండియన్స్ ఈ పద్దతిని ఎక్కువగా అనుసరిస్తారు.
డార్క్‌గా ఉన్నవారు ఫెయిర్‌గా మర్చడం కోసం శెనగపిండిని రోజ్ వాటర్ లేదా పాలతో మాక్స్ చేసి వారంలో రెండు సార్లు వేసుకోవచ్చు. పాలతోచర్మం శుభ్రం చేసుకోవడం వల్ల తప్పకుండా స్కిన్ కలర్‌ను మెరుగుపరుస్తుంది. పెరుగులో ఉండే సౌందర్యవర్ధక గుణాలే, పాలలో కూడా పుష్కలంగా ఉంది. కీరదోసకాయతో ఇతర పదార్థాలను కూడా జోడించి స్కిన్ టోన్‌ను మెరుగుపరుచుకోవచ్చు. కీరదోసకాయ పేస్ట్‌తో కొబ్బరి పాలు లేదా తేనె చేర్చడం వల్ల మీ చర్మం నేచురల్‌గా ఫెయిర్‌గా మారుతుంది.
స్కిన్ టోన్‌ను మెరుగుపరచడంలో ఉత్తమ హోం రెమెడీ బాదం. బాదంను రాత్రంతా నీటిలో నానబెట్టి, మెత్తగా పేస్ట్ చేసి, తర్వాత దానికి కొద్దిగా పాలు మిక్స్ చేసి తర్వాత ఈ పేస్ట్‌ను వారంల రెండు సార్లు ముఖానికి అప్లై చేయడం వల్ల ఉత్తమ ఫలితం పొందవచ్చు.


