కాలుష్య నివారణకు ప్రభుత్వం కృషి: మంత్రి కేటీఆర్
- 83 Views
- wadminw
- December 21, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్ రాజధానిలో వాయు,జల శబ్ద కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తారు. చార్మినార్తోపాటు ముఖ్యమైన ప్రధాన ప్రాంతాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని దీంతో అస్తమ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆరోగ్యవంతులు కూడా కాలుష్యంతో అనారోగ్యం పాలవుతున్నారని ఆయన ఆరోపించారు.
కాలుష్య నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా చెత్త ద్వారా వెలువడే కాలుష్యం నుంచి ప్రజలకు ఎలాంటి విముక్తి కల్పిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దీనికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వాహనాలను నుంచి వెలువడే పొగ ద్వారా 49 శాతం రహదారుల వల్ల, 33 శాతం పొగ్గు, సిమెంట్ ఇతర మార్గాల ద్వారా కాలుష్యం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో కాలుష్యం తక్కువగానే ఉందని మంత్రి తెలిపారు.


