కాస్త తగ్గిన కరోనా
- 55 Views
- admin
- April 17, 2023
- Health & Beauty
దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 60 వేల మార్కు దాటింది. ప్రస్తుతం 60,313 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,111 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం ప్రకటించింది. గడచిన 24 గంటల్లో వైరస్ వల్ల 27 మరణాలు నమోదయ్యాయి. గుజరాత్ లోనే ఆరుగురు చనిపోయారు. కరోనా వల్ల దేశంలో మరణాల సంఖ్య 5,31,141కి చేరుకుంది. ఇక, ఒక్క రోజులో 6,313 మంది వైరస్ నుంచి కోలుకున్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. జాతీయ రికవరీ రేటు 98.68 శాతంగా ఉంది. ఆదివారం 10,093 కేసులు రాగా.. ఒక్క రోజులోనే దాదాపు వెయ్యి కేసులు తగ్గడం కాస్త ఊపశమనం కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 8.40 శాతంగా ఉంది. వారంవారీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తన బులిటెన్లో పేర్కొంది.
Categories

Recent Posts

