కుర్రకారును కిర్రెక్కిస్తున్న రేష్మీ గౌతమ్
వచ్చీరాని తెలుగుతో, సగం మిలితం చేసిన ఆంగ్లంతో బుల్లితెరపై ఆకట్టుకున్న రేష్మీ గౌతమ్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పాపులర్ అయింది. బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతూనే వెండితెరపైనా సందడి చేస్తున్న ఈ భామ పొట్టిపొట్టి డ్రెస్సులతో కుర్రకారును కిర్రెక్కిస్తూనే ఉంది. రేష్మీ సినిమా అంటే కుర్రకారుకు కిర్రాకే. అందుకే యువత అంతా ఆమె సినిమాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆమె కూడా వారిని ఏ మాత్రం నిరాశపర్చకుండా తన వంతు అందాల ప్రదర్శన చేస్తోంది. పైగా దానిపై ఇఫ్పుడు పలు వివరణలు కూడా ఇచ్చింది. యువత కోసం ఆమె పలు ‘అందమైన మాటలు’ చెప్పింది. ‘‘నాకున్న అందాన్ని చూపిస్తే తప్పేంటి’’ అని ప్రశ్నించింది.
సినిమాలంటేనే గ్లామర్ ప్రపంచం. ఆ గ్లామర్ ప్రపంచంలో అందం కాక ఇంకేమి ఉంటుందని ప్రశ్నించింది. హీరోయిన్లను అందంగా చూపిస్తేనే ప్రేక్షకులు ధియేటర్లకు వస్తారని, అందంగా చూపించడం, కనిపించడం తప్పంటే ఎలా? అంటూ ఒకిం అసహనం వ్యక్తం చేసింది. అందానికీ, అసభ్యతకీ చిన్న గీత మాత్రమే అడ్డు, ఈ విషయం తనకు బాగా తెలుసు అని తేల్చేసింది. గుంటూర్ టాకీస్ సినిమా ద్వారా నవ తరం వెండి తెర తారగా పరిచయం అయి అందాలన్నింటినీ ఆరబోసిన విషయం అందరికీ విదితమే. అయితే ఆ సోనిమా పై రష్మీ ఎక్స్ పోసింగ్పై ఎన్నో గాసిప్స్ కూడా విడుదలైన విషయం అందరికీ విదితమే. అయితే ఈ గాసిప్స్‌ను ఎంత మాత్రం పట్టించుకోని రష్మీ మరో సినిమాకు హాట్‌గా సిద్ధం అవుతోంది.


