కృష్ణా జిల్లా అభివృద్ధే ధ్యేయమన్న జడ్పీ చైర్మన్
- 74 Views
- wadminw
- September 21, 2016
- రాష్ట్రీయం
విజయవాడ, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): కృష్ణా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనురాధ తెలిపారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం వెంకటాపూరంలో ఆమె బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టారని ఇందుకు అనుగుణంగానే తాము నడుచుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా వెంకటాపురంలో పలువురు వైసీసీ నాయకులు, కార్యకర్తలు గద్దె అనురాధ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ఆమె పసుపు కండువాలు కల్పి స్వాగతం పలికారు.
నందిగామలో యువకుడి దారుణ హత్య
విజయవాడ, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): కృష్ణా జిల్లా నందిగామలో ఒక వ్యక్తిని బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేసిన సంఘటన బుధవారం జరిగింది. నాగరాజు అనే వ్యక్తిని కొందరు దుండగులు అటకాయించి బ్లేడ్‌తో గొంతు కోసి ఫరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న నాగరాజును స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా ఇక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. నాగరాజు అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి బంధువులు ఈ హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోరణంలో దర్యాప్తు చేస్తున్నారు.
రూ. 2 కోట్లతో ఫరారైన చీటిల నిర్వాహకురాలు
విజయవాడ, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): చీటి పాటల పేరుతో 2 కోట్ల రూపాయలు వసూలు చేసి ఒక మహిళ ఫరారైన సంఘటన నూజివీడులో బుధవారం జరిగింది. సీతారత్నం అనే మహిళ ఇంట్లోనే చీటిపాటుల నిర్వహిస్తూ ప్రజలను నమ్మించి దాదాపు 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే చీటిపాడుతున్న వారికి సొమ్ము చెల్లించని నేపథ్యంలో ఆమెపై ఒత్తిడి పెరిగింది. పోలీసులకు దాక విషయం వెళ్లగా బుధవారం సగం సొమ్ము చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే బుధవారం ఖాతాదారులు ఆమె ఇంటికి వెళ్లిసరికి ఇల్లు ఖాళీ చేసి ఉందని కుటుంబ సభ్యులతో సహా సీతారత్నం ఫరారైంది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా వారు గాలింపు చర్యలు చేపట్టారు. సీతారత్నం ఇంటిని సీజ్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.


