కేసీఆర్ జాతీయ పార్టీ
- 104 Views
- admin
- September 7, 2020
- Home Slider జాతీయం రాష్ట్రీయం
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కన్నేసినట్లు గత ఎన్నికల ముందే అర్థమయ్యింది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాల నే ఆలోచనలో ఆయన ఉన్నట్లు అనుకుంటున్నారు. అందు కోసం ఇప్పటికే పలు జాతీయ పార్టీతో ఆయన మంతనాలు సాగిసున్నారని సమాచారం. కాగా ఆయన బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యామ్మాయంగా కేసీఆర్ ‘జాతీయ’ పార్టీకి పురుడు పోస్తున్నట్టు సమాచారం. ఈ రెండు పార్టీల తో దేశం బాగుపడలేదని.. ప్రాంతీయ పార్టీల తో కొత్త పార్టీ దిశగా కేసీఆర్ అడుగు వేస్తున్నట్టు సమాచారం. పార్టీపై న్యాయకోవిదులు నిపుణుతో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల పై టీఆర్ఎస్ఎల్పీలోనూ దీనిపై చర్చ జరగబోతోందని సమాచారం. ఈ క్రమంలోనే తీర్మానం చేస్తారని అంటున్నారు. ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. రాష్ట్ర పగ్గాలు .. సీఎం పీఠం కేసీఆర్కు వెళుతుందని అంటున్నారు. మరి కేసీఆర్ తెలం గాణను ఏలినట్టే.. దేశాన్ని దున్నేస్తారా అన్నది వేచిచూడాలి.


