కొత్తజిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు వినతి
- 190 Views
- wadminw
- September 3, 2016
- Home Slider తాజా వార్తలు
ఆదిలాబాద్: కొత్తగా ఏర్పాటు కానున్న నిర్మల్ జిల్లాలో ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విశ్వవిద్యాలయ సాధన కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డికి వినతిపత్రం అందజేశామని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రజల ఉన్నత విద్య కలలను సాకారం చేసేలా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.
గతంలో కేంద్రం నిర్మల్లో ఉన్న పిజి కళాశాలను ఉన్నతీకరించాలని నివేదికలో పంపించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశం మరుగునపడిందని ఇప్పటికైనా కొత్త జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల కోరికను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు సిఫార్సు చేస్తామని చైర్మన్ పాపిరెడ్డి హామీ ఇచ్చినట్లు ఆయన వివరించారు.
Categories

Recent Posts

