కొత్త రూ. 500 నోట్లలో స్వల్ప మార్పులు!
కొత్త రూ. 500 నోట్లలో స్వల్ప మార్పులు, చేర్పులు చేసినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రనటలో పేర్కొంది. ఈ నోటుపై ఉన్న రెండు నెంబర్ ప్యానల్స్‌పై ఆర్ అనే అక్షరం అంగతర్లీనంగా కల్పించనుందని పేర్కొంది. మహాత్మాగాంధీ సరీస్‌లో వస్తున్న ఈ నోటుపై 2016 సంవత్సరంతోపాటు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆ ప్రకటనలో కోరింది.
కాగా, రూ. 500,1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నోట్ల స్థానే రెండు వేలు, కొత్త ఐదు వందల నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది.
Categories

Recent Posts

