కొనసాగుతున్న ఆదివాసి దీక్షలు
ఆదిలాబాద్, అక్టోబర్ 25 (న్యూస్టైమ్): గిరిజన ప్రాంతాలలో అటవీ హక్కులను ఉల్లంఘిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోని 1-70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన రీలే నిరహార దీక్షలు మంగళవారంనాటికి 20వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో పెద్ద ఎత్తున ఆదివాసి మహిళలు పాల్గొని తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఆదివాసి హక్కులను కాలరాస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
నకిలీ ఎజెన్సీ దృవపత్రాలను పొంది ఉద్యోగాలు చేస్తున్న వారిని విధుల నుండి తొలగించడంతోపాటు గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం దీక్షలు చేపట్టిన ప్రభుత్వం ఇంత వరకు స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. తమ డిమాండ్లు పరిష్కారమమయ్యేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.


