కోహ్లీ సేన క్రిస్మస్ కానుక!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నైలో జరిగిన క్రికెట్ టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సేన అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్‌ను 208 పరుగులకే కుప్పకూల్చడం ద్వారా ఇన్నింగ్స్ 75 పరుగుల విజయంతో సిరీస్‌ను 4-0తో టీమిండియా సొంతం చేసుకొంది. కోహ్లీ సేన విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ విజయంలో కీ రోల్ పోషించిన కెప్టెన్ విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
అంతకుముందు ఇన్నింగ్స్ ఓటమి తప్పాలంటే 270 పరుగుల స్కోరు చేయాల్సిన ఇంగ్లండ్‌ను భారత లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా స్పిన్ మ్యాజిక్‌తో చుట్టిపడేశాడు. ఓపెనర్లు అలీస్టర్ కుక్ 49, జెన్నింగ్స్ 54 పరుగుల స్కోర్లతో ఒకరి వెనుక ఒకరుగా అవుట్ కావడంతో మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది. రెండో డౌన్ ఆటగాడు మోయిన్ అలీ 44 పరుగుల స్కోరుకు అశ్విన్ పట్టిన సూపర్ క్యాచ్‌కు అవుట్ కావడంతో టీమిండియా విజయం ఖాయమైపోయింది. రూట్ 6, బెయిర్ స్టో 1,స్టోక్స్ 23, డాసన్ 0, రషీద్ 2 పరుగులకు అవుటయ్యారు.
టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 48 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఐదుమ్యాచ్ ల ఈ సిరీస్‌ను టీమిండియా 4-0తో గెలుచుకొని ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకోగలిగింది. క్రిస్మస్ ముందు ప్రత్యర్థి ఆటగాళ్లు చేదు అనుభవంతో సొంత దేశానికి పయనం అవుతుండటం గమనార్హం. చెపాక్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్‌ను కరుణ్ నాయర్ బ్యాటింగ్‌తో దెబ్బతీయగా స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌తో నడ్డివిరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కరుణ్ (303) అజేయ త్రిశతకంతో భారత్‌కు 282 పరుగుల ఆధిక్యం అందించగా జడేజా 48 పరుగులే ఇచ్చి కీలక సమయాల్లో 7 వికెట్లు పడగొట్టాడు.
ఓవర్‌నైట్ స్కోర్ 12/0తో చివరి రోజు, మంగళవారం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలుత ఆచితూచి ఆడింది. కెప్టెన్ అలిస్టర్ కుక్ (49), కీటన్ జెన్నింగ్స్ (54) శుభారంభం అందించారు. ఈ జోడీని విడదీసేందుకు భారత్ 103 పరుగుల దాకా ఆగాల్సి వచ్చింది. కుక్‌ను జడేజా సిరీస్‌లో ఆరోసారి ఔట్ చేసి ప్రత్యర్థి పతనానికి నాంది పలికాడు. జడ్డూ విజృంభణతో ఇంగ్లాండ్ కెప్టెన్ కుక్ వికెట్ కోల్పోయిన తర్వాత 104 పరుగుల్లోపే మిగతా 9 వికెట్లు చేజార్చుకొంది. తొలి నలుగురు బ్యాట్స్‌మెన్ కుక్ (49), జెన్నింగ్స్ (54), జో రూట్ (6), మొయిన్అలీ (44)ని జడేజానే ఔట్ చేశాడు. 129 పరుగుల వద్ద నాలుగో వికెట్ తీసిన భారత్ మరో వికెట్ తీయడానికి 192 వరకు వేచిచూసింది.
టీ విరామం తర్వాత మొయిన్ అలీని పెవిలియన్‌కు పంపించి జడేజా ఇంగ్లాండ్ ఆశలను చిదిమేశాడు. ఆ తర్వాత నాలుగు పరుగులలోపే బెన్‌స్టోక్స్ (23)ను జడేజా, డాసన్ (0)ను 196/7 వద్ద అమిత్‌మిశ్రా పెవిలియన్‌కు పంపించి ప్రత్యర్థి మీద మరింత ఒత్తిడి పెంచడంతో ఆ తర్వాత 11 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది. సొంతమైదానంలో అశ్విన్ ఒక్క వికెట్ సైతం తీయకపోవడం గమనార్హం. కాగా, 192 పరుగుల వద్ద అలీని జడేజా ఐదో వికెట్‌గా అవుట్ చేయడంతో ఇక ఇంగ్లండ్ తేరుకోలేదు. పరుగు వ్యవధిలో స్టోక్స్‌ను జడేజా అవుట్ చేసి ఇంగ్లండ్ వెన్నువిరిచాడు.
ఆపై కాసేపటికి డాసన్(0)ను అమిత్ మిశ్రా అవుట్ చేయగా, రషిద్(2)ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు. అయితే జాస్ బట్లర్-స్టువర్ట్ బ్రాడ్లు కాసేపు భారత్ బౌలింగ్‌ను ప్రతిఘటించినా ఫలితం దక్కలేదు. తొలుత ఈ జోడిలో బ్రాడ్‌ను జడేజా అవుట్ చేయగా, ఆ తరువాత వెంటనే బాల్ కూడా జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. దాంతో భారత్ ఖాతాలో అపూర్వమైన విజయం చేరింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కరుణ్ నాయర్‌కు దక్కగా, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు విరాట్ కోహ్లికి లభించింది. ఇది భారత్‌కు వరుసగా 18వ టెస్టు విజయం కావడం మరొక విశేషం కాగా, 2015 నుంచి వరుసగా ఐదో టెస్టు సిరీస్ విజయం.


