క్రీడా రంగ ప్రగతే ఆచార్య శ్యాంబాబు ఆకాంక్ష
విశాఖపట్నం, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం, వివాఖ క్రీడా రంగాలను అభివృద్ది చేయాలనే తపనతో నిరంతరం ఆచార్య మండ్రు శ్యాంబాబు పనిచేసారని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఉదయం ఏయూ బాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అసెంబ్లీ మందిరంలో నిర్వహించిన ఆచార్య శ్యాంబాబు సంతాప సభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆచార్య శ్యాంబాబు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడా రంగాన్ని అభివృద్ది చేయడమే ఆనయకు నిజమైన నివాళిగా నిలుస్తుందన్నారు. తన మంచితనం, కార్యదక్షతతో దేశ వ్యాప్తంగా అభిమానులను పొందారన్నారు.
ఆచార్య శ్యాంబాబును ఆదర్శంగా తీసుకుని ఆచార్యులు పనిచేయాలన్నారు. శ్యాంబాబు పేరుతో బంగారు పతకం, స్మారకోపన్యాసం ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయడం మంచి పరిణామమన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ అందరికీ ఆప్తుడిగా, వర్సిటీ అభివృద్ది కార్యక్రమాలలో భాగస్వామిగా నిలచి సమర్ధ నిర్వహణకు తోడ్పాటును అందించే వారన్నారు. వర్సిటీ పాలక మండలి సభ్యులు ఆచార్య ఎం.ప్రసాదరావు మాట్లాడుతూ ఆచార్య శ్యాంబాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఏపీ వాలీబాల్ అసోసియేషన్ అద్యక్షుడు కోదండ రామయ్య మాట్లాడుతూ శ్యాంబాబు వంటి మానవతావాదిని చూడలేదన్నారు.
ద ఒలంపిక్ అసోసియేషన్ అద్యక్షుడు టి.ఎస్.ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ వర్సిటీలో ధ్యాన్‌చంద్ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆచార్య శ్యాంబాబు కృషి షలితమేనన్నారు. ఆయన మరణం వర్సిటీకి తీరని లోటన్నారు. విశాఖ నగంలో క్రీడలు నిర్వహించే సమయంలో ముందుడి నడిపించే శక్తి శ్యాంబాబేనని పలువురు క్రీడా సంఘాల ప్రతినిధులు అన్నారు. వర్సిటీలో క్రీడా మైదానానికి ఆచార్య శ్యాంబాబు పేరు పెట్టాలని సూచించారు. నాటా ప్రతినిధి బసవపున్నయ్య మాట్లాడుతూ ఎండోమెంట్ లెక్చర్ ఏర్పాటుకు రూ 50 వేలు అందించడం జరుగుతుందన్నారు.
ఆదికవి నన్నయ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయ రావు మాట్లాడుతూ ఆచార్య శ్యాంబాబు మిత్రులు, అభిమానులు రూ 5 లక్షలను వర్సిటీకి అందిస్తాయన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకం అందించాలని కోరారు. కార్యక్రమంలో జివిఎంసీ జోనల్ కమీషనర్ శ్రీనివాస్, ప్రసన్న కుమార్, జిల్లా క్రీడా అధికారిణి జూన్ గాలియేట్, నరసింహారావు తదితరులు ప్రసంగించారు. ఏయూ ప్రిన్సిపాల్స్ ఆచార్య సి.వి రామన్, పి.ఎస్ అవధాని, ఆచార్య గాయత్రీ దేవి, కృష్ణమూర్తి, డాక్టర్ మూర్తి, జాకబ్ శాస్త్రి, షారోన్ రాజు,పి.హరి ప్రకాష్, ఎం.వి.ఆర్ రాజు, చంద్రమౌళి,విజయమోహన్ తదితరులు ప్రసంగించారు. వర్సిటీ ఆచార్యులు, క్రీడా విభాగం సిబ్బంది, విద్యార్థులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు పెద్దసంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.


