గవర్నర్ నరసింహన్‌తో వైఎస్ జగన్ భేటీ
- 72 Views
- wadminw
- December 22, 2016
- రాష్ట్రీయం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్‌తో ఆయన భేటీ అయ్యారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి నరసింహన్‌కు జగన్ వివరించి చెప్పారు.
జగన్‌తో పాటు పలువురు వైసిపి నేతలు కూడా ఉన్నారు. గత 42 రోజులుగా రాష్ట్రంలోని రైతులు, సామాన్యులు, చిరువ్యాపారులు ఎదుర్కొంటున్న కష్టాలను, వ్యాపారులు నష్టపోతున్న అంశాలను గురించి ఆయన గవర్నర్‌కు వివరిస్తున్నట్లు వైసిపి పార్టీ వర్గాలు తెలిపాయి.
Categories

Recent Posts

