గిరిజన గ్రామాల్లో దోమతెరల పంపిణీ
- 125 Views
- wadminw
- September 3, 2016
- రాష్ట్రీయం
ఆదిలాబాద్: జిల్లాలో త్వరలో లక్ష దోమతెరలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా మలేరియా అధికారి రవి తెలిపారు. బుధవారం జైనూరు మండలంలోని మేడిగూడ గ్రామంలో నిరుపేద గిరిజన కుటుంబాలకు దోమ తెరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా దోమతెరల పంపిణీకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
మొదటివిడతలో ఏజెన్సీలోని కొలాం గిరిజన కుటుంబాలకు దోమతెరలు అందిస్తామని అన్నారు. జిల్లావ్యాప్తంగా మలేరియా ప్రభావిత గ్రామాల పేదలకు దోమతెరల పంపిణీకి కేంద్రప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది చాలా వరకు మారుమూల గ్రామాలలో వ్యాధులను అరికట్టడంలో వైద్య సిబ్బంది సఫలీకృతులయ్యారని ఆయన తెలిపారు.
Categories

Recent Posts

