గుడ్డులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా?
కొంత మంది తమను తము ‘ఎగ్ టేరియన్స్’గా చెప్పకుంటుంటారు. అందుకు కారణం వారు మాంసాహారం తీసుకోకపోయినా గుడ్డులో అధిక పోషకాలు ఉన్నందు వల్ల, గుడ్డును తినడానికి ఎక్కువగా ఇష్టపడటం వల్ల ఎగేటేరియన్లుగా ఫిక్స్ అయిపోతారు. అంతే కాకుండా గుడ్డును మాసాంహారం అంటారు కానీ, చాలా మంది శాకాహారంగానే భావిస్తున్నారు. కాబట్టే శాకాహారులు కూడా గుడ్డును తినడం మొదలు పెట్టేసారు. గుడ్డులో చెప్పుకోలేనన్ని ఆరోగ్యప్రయోజనాలు మొండుగా ఉన్నాయి. గుడ్డు మంచి పౌష్టికాహారం. చిన్నపిల్లలు మొదలుకొని, ముసలివారి వరకు డాక్టర్లు గుడ్డు తినమని చెబుతారు.
కోడిగుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రొటీన్లను అందజేస్తుంది. పోష కాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా వైద్యులు సలహాలిస్తుంటారు. గుడ్డులో పలురకాల లవణాలు, అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్, అయోడిన్, సెలీనియం, ఐరన్, జింక్‌లు ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే. ప్రతి రోజూ గుడ్డు తినడం వల్ల గుండెజబ్బు వస్తుందని వేడిచేస్తుందనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ ఈ అభిప్రాయంలో వాస్తవం లేదు. వారంలో వారం రోజులు గుడ్డు తిన్నా కూడా దాని కారణంగా ఎటువంటి గుండెజబ్బులూ రావడానికి ఆస్కారం లేదని వైద్య నిపునులు అంటున్నారు.
నిజానికి కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు తలెత్తుతాయి కానీ, కాలేయం కొలెస్ట్రాల్‌ని ఉత్పత్తి చేయాలంటే ఆహారంలో హానికారక శాచురేటెడ్, ట్రాన్స్ ప్యాట్లు ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. నిజానికి గుడ్డు అనేక పోషకాల మిళితం. ఇందులో శరీరానికి అవసరమయ్యే అన్నీ కీలకమై విటమిన్లు, ఖనిజాలు, మేలు చేసే అన్ శాచురేటెడ్ కొవ్వులు, మాంసకృత్తులు లభిస్తాయి. బరువును కూడా తగ్గిస్తుంది. అలాఅని ఒక రోజుకు నాలుగు గుడ్లును తినడం మంచిది కాదు. గుడ్లను సరైన పద్దతిలో ఉడికించి ఒక రోజుకు ఒకటి రెండు గుడ్లును తినవచ్చు.
కాబట్టి గుడ్డువల్ల కొన్ని నిజాలతో పాటు… మరికొన్ని హెల్గ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం… శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. ముఖ్యంగా 9 డిఫరెంట్ టైప్స్ అమినో ఆసిడ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గేందుకు గుడ్డు పనికొస్తుంది. అందులో ఉన్న నాణ్యమైన ప్రోటీన్ల వల్ల గుడ్డు తీసుకోగానే కడుపు నిండినట్టుగా అవుతుంది. ఎక్కువ ఆహారం తీసుకోనివ్వదు… అందువల్ల పరిమిత ఆహారం తీసుకొని బరువును నియంత్రించుకోగలుగుతారు. గుడ్డు తక్కువ క్యాలరీలు శక్తిని ఇస్తుంది సాధారణ సైజు గుడ్డు 80 క్యాలరీలు శక్తిని అందిస్తుంది కాబట్టి డైటింగ్‌లో ఉన్నవారు కూడా గుడ్డును తీసుకోవచ్చు. కోడి గుడ్డు తింటే దృష్టికి ఎంతో మేలు కలుగుతుంది. రోజు గుడ్డు తినేవారికి ఐ సైట్ మరియు శుక్లాలు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది.
గుడ్డులో విటమిన్-ఎ ప్రధానమైన జీవపోషకం. ఇది గుడ్డులోని పచ్చసోనలోనే అధికం. కంటి దోషాలు లేకుండా ఉండాలంటే జింక్, సెలీనియం, విటమిన్-ఇ ఇందులో అధికంగా ఉన్నాయి. పిల్లల పెరు గుదలకు మంచిది. పిల్ల మెడడుకు ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు గుడ్డులో ఉన్నాయి. గుడ్డుసొనలో 300 మైక్రోగ్రాములు కోలిన్ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడులో సమాచార రవాణాన్ని మెరుగుపరుస్తుంది, మెదడు నుండి సంకేతాలు వేగంగా చేరవేయడంలో కూడా కోలిన్ ప్రాత్ర వహిస్తుసంది. గుడ్డులో ఉన్న ఐరన్ శరీరం చాలా సులభంగా గ్రహిస్తుంది. అలా గ్రహించే రూపంలో ఐరన్ ఉన్నందున గుడ్డు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడే శక్తి గుడ్డుకి ఉందని కొన్ని పరిశోధనల్లో తేలింది.
ఇందులో క్యాల్షియం కంటే విటమిన్ డి ఎక్కువ. గుండె కండరం నిరంతరంగా పనిచేయడానికి ప్రోటీన్ అవసరం. అది గుడ్డులోని తెల్లసోనలో అపారంగా ఉంటుంది. గుండె కండరాలు పనిచేయడానికి పచ్చసోనలో ఎక్కువగా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి 12 ఖనిజాలు, 12 రకాల విటమిన్లు ఉంటాయి. ఒత్తిడిని తగ్గించే శక్తి గుడ్డులో ఉంది. తెల్లసోనలో హిస్టోడిన్, పచ్చసోనలో జింక్, కోలిన్, అయోడిన్, లినోలిక్ యాసిడ్ ఉంటాయి. వీటితో కొత్త మేధస్సు కణాలు ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతుంటాయి. ఫలితంగా ఒత్తిడి నుండి కాపాడటమే కాక జ్ఞాపకశక్తిని, వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
జీవనశైలిలో వ్యాధుల్లో మధుమేహం ఒకటి. గుడ్డులోని తెల్లసోనలో ఉండే ప్రోటీను ప్యాక్రియాస్ గ్రంథిని నిర్మించి, జింక్, క్రోమియం ద్వారా ఇన్సులిన్‌కు జీవక్రియ కలుగజేస్తుంది. ఇన్సులిన్ అడ్డంకిని తొలగించడానికి ఉపయోగపడే విటమిన్-ఇ, దాన్ని మెరుగుపరచడానికి కావాల్సిన మేగ్నీషియం, బయోటిన్, నియోసిన్ అనే విటమిన్లు గుడ్డులోని పచ్చసోనలో అపారం. ఐతే టైప్ 2 డయాబిటీస్ ఉన్నవారు గుడ్డును వాడరాదు. రిస్క్‌ను ఎక్కువ చేస్తుందని రిపోర్టులున్నాయి. శరీరంలోని అస్థిపంజరం నిర్మాణానికి ముఖ్యమైన పోషకాలు గుడ్డులోని పచ్చసోనలో అధికంగా ఉంటాయి. ఎముకలకు కాల్షియం ముఖ్యం. దీన్ని గ్రహించడానికి విటమిన్-డి, ఎముకల్లో జరిగే జీవ రసాయనిక ప్రతి క్రియలన్నింటిలో మెగ్నీషియం చాలా అవసరం.
విటమిన్-కె, ఫోలిక్ యాసిడ్, బి6, బి12 గుడ్డులో అధికంగా ఉంటాయి. గుడ్డులోని పచ్చసోనలో శరీర సౌష్టవాన్ని కాపాడే విటమిన్-డి, అనవసరమైన కొవ్వును కరిగించే కోలిన్ అనే ధాతువు, సెలీనియం, బి12 పుష్కలంగా ఉంటాయి. వారానికి మూడు సార్లు రెండు గుడ్ల చొప్పున ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఊబకాయం తగ్గుతుందని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. గుడ్డులోని పచ్చసోనలో అనేక యాంటి యాక్సిడెంట్లు ఉన్నాయి. విటమిన్-ఎ, కెరోటిన్ ద్వారా లూమీప్లేమిన్, లూమీక్రోమిన్ అనే యాంటి యాక్సిడెంట్లు ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను నివారించొచ్చు. లూటిన్, జియాక్సాంథిన్ ద్వారా చర్మ క్యాన్సర్‌ను నిరోధించొచ్చు. గుడ్డు పచ్చ సోనలోని విటమిన్-ఇ క్యాన్సర్ కణాలను క్షీణించేలా చేస్తుంది. గుడ్డులోని పచ్చసోనలో అనేక యాంటి యాక్సిడెంట్లు ఉన్నాయి.
విటమిన్-ఎ, కెరోటిన్ ద్వారా లూమీప్లేమిన్, లూమీక్రోమిన్ అనే యాంటి యాక్సిడెంట్లు ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను నివారించొచ్చు. లూటిన్, జియాక్సాంథిన్ ద్వారా చర్మ క్యాన్సర్‌ను నిరోధించొచ్చు. గుడ్డు పచ్చ సోనలోని విటమిన్-ఇ క్యాన్సర్ కణాలను క్షీణించేలా చేస్తుంది. గుడ్డులోని ప్రోటీన్ల వల్ల యవ్వనంలో కండరాలకు బలం, చక్కని రూపం ఏర్పడుతుంది. గుడ్డులో ఉండే సల్ఫర్ చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా శిరోజాల ఆరోగ్యం మెరు గవుతుంది. గుడ్డులో ఉన్న సల్ఫర్, పలురకాల విటమిన్లు, లవణాల వల్ల శిరోజాలకు మంచి పోషణ లభిస్తుంది. మనుషుల గోళ్ళకు మంచి ఆరోగ్యాన్ని గుడ్డు అందిస్తుంది. కండరాలకు పుష్టిని ఇచ్చే అత్యావశ్యకమైన ఎమినో ఆసిడ్స్ ను కలిగి ఉండటమే కాకుండా కోడిగుడ్డు సొనలో ‘విటమిన్ డి’పుష్కలంగా ఉంటుంది.
ఇది కూడా కండరాల కణజాలానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది క్రీడాకారులకు మంచి బ్రేక్ ఫాస్ట్. గుడ్డులోని తెల్లసోనలో హిస్టోడిన్, పచ్చసోనలో జింక్, కోలిన్, అయోడిన్, లినోలిక్ యాసిడ్ ఉంటాయి. వీటితో కొత్త మేధస్సు కణాలు ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతుంటాయి. వీటితో పాటు అధికంగా ప్రోటీనులు, న్యూట్రిషియంట్స్, అంతే కాకుండా ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు. గుడ్డులోని పచ్చసొన పిల్లతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ఆరోగ్యకరం. గుడ్డును తినడానికి మంచి సమయం ఉదయం తినే అల్పాహారం. ఒక రకంగా చెప్పలాంటే తయారు చేయడం సులభం, త్వరగా కూడా అయిపోతుంది. శరీరానికి ప్రోటీనులు మరియు కార్బోహైడ్రేట్లు వంటివన్నీయు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తోనే శరీరానికి అందుతాయి.
గుడ్డును బాగా ఉడికించి అందులోని బాక్టీరియాను పూర్తిగా సంహరించబడేలా చూసుకోవాలి. బాక్టీరియా వల్ల శరీరానికి నస్టం జరుగుతుంది. గుడ్డుని ఫ్రై చేసుకోవడం కానీ, లేదా అతి తక్కువ ఆయిల్ ఉపయోగించి ఎగ్ బుర్జ్ చేసుకోవడం కానీ చేయవచ్చు. ఒక వేళ మీరు ఇప్పటికే హార్ట్ పేషంట్ ఐతే లేదా అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు గుడ్డును తినడం మానేయాలి. ఎందుకంటే గుడ్డు పచ్చసొనలో చాలా కొలెస్ట్రాల్ నిల్వ ఉంటుంది కాబట్టి, అది హార్ట్ పేషంట్స్ కు హాని కలిగిస్తుంది. కొలెస్టరాల్ జబ్బులతో బాధపడుతున్నవారు గుడ్డును తీసుకొరాదు. కొంతమందిలో ఫుడ్ ఎలర్జీ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు ఉన్నాయి. కావున ఫుడ్ ఎలర్జీ ఉన్నవారు గుడ్డు తీసుకోరాదు.


