గుడ్లు తింటే ఇన్ని ఉపయోగాలా ..
- 139 Views
- admin
- June 27, 2022
- Health & Beauty తాజా వార్తలు
ఉడుకబెట్టిన కోడిగుడ్లు తింటే మన ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలున్నాయో మీకు తెలుసా ? అయితే ఇవి ఒక్కసారి చదవండి
ఎగ్ యోక్లో కొలెస్ట్రాల్, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి, గుండెకి మంచిది కాదు అంటూ ఉంటారు. కానీ, అది నిజం కాదు. ఎగ్స్ నిజానికి గుండెకి చాలా మేలు చేస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ తగ్గించి కార్డియో వాస్క్యులర్ ఫంక్షన్స్‌ని బూస్ట్ చేస్తాయి. ఎగ్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఈ మేలుకి కారణం. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ బ్లడ్‌లో ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ నీ, తద్వారా కొలెస్ట్రాల్ నీ తగ్గిస్తాయి. ఇవి మెటబాలిజంని కూడా రెగ్యులేట్ చేస్తాయి.
ఐ హెల్త్ కీ, బెటర్ విజన్‌కీ కావాల్సిన రెండు ఇంపార్టెంట్ న్యూట్రియెంట్స్ – విటమిన్ ఏ, ల్యుటేన్ – హార్డ్ బాయిల్డ్ ఎగ్స్‌లో ఉన్నాయి. విటమిన్ ఏ కార్నియా చుట్టూ ఉండే మెంబ్రేన్ని కాపాడి, రేచీకటి వచ్చే ముప్పుని తగ్గిస్తుంది. ఒక హార్డ్ బాయిల్డ్ ఎగ్ లో డెబ్భై ఐదు మైక్రో గ్రాముల విటమిన్ ఏ ఉంటుంది. ల్యుటేన్ ఒక యాంటీ-ఆక్సిడెంట్. ఇది రెటీనాని స్ట్రాంగ్‌గా చేసి మాక్యులర్ డీజెనరేషన్ జరిగే రిస్క్‌ని తగ్గిస్తుంది. ఎగ్స్‌లో ఉండే ల్యుటేన్‌ని బాడీ ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది కూడా.
హార్డ్ బాయిల్డ్ ఎగ్స్‌లో ఉండే ఇంకొక ఇంపార్టెంట్ కాంపోనెంట్ విటమిన్ డీ. విటమిన్ డీ లభించే ఆహార పదార్ధాలు చాలా తక్కువ. వాటిలో హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఒకటి. పళ్ళకీ, ఎముకలకీ విటమిన్ డీ చాలా మేలు చేస్తుంది. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఫుడ్ లోంచి శరీరం కాల్షియం గ్రహించడానికి కూడా విటమిన్ డీ అవసరం. పైగా ఈ విటమిన్ బ్లడ్ లోని కాల్షియం లెవెల్స్‌ని రెగ్యులేట్ చేస్తుంది.
ఎగ్ యోక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీ యోక్ లోనే కోలీన్ అనే న్యూట్రియెంట్ ఉంటుంది. ఇది బ్రెయిన్ ఫంక్షన్ ని సపోర్ట్ చేసి సెల్ మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ ని మెయింటెయిన్ చేస్తుంది. బ్రెయిన్ సెల్స్ ఒక దానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి కూడా కోలీన్ అవసరం. కోలీన్ వల్ల బ్రెయిన్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చే రిస్క్ తగ్గడమే కాక, అల్జైమర్స్ వ్యాధి వచ్చే ముప్పు కూడా తగ్గుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటే గర్భస్థ శిసువు బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఉపయోగపడడమే కాక బిడ్డకి పుట్టుకతో వచ్చే లోపాలు రాకుండా ఉంటాయి.
ఎగ్స్ హై క్వాలిటీ ప్రొటీన్‌కి బెస్ట్ సోర్స్. పైగా అవి అన్ని వేళలా అందుబాటులోనే ఉంటాయి కూడా. హెల్దీ బాడీకి కావలసిన విటమిన్స్, మినరల్స్, హెల్దీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎగ్స్ లో పుష్కలం గా ఉంటాయి. ప్రతి హార్డ్ బాయిల్డ్ ఎగ్ లోనూ పదమూడు ఎస్సెన్షియల్ విటమిన్స్ మరియూ మినరల్స్ ఉంటాయి. అంటే, విటమిన్స్ ఏ, ఈ, డీ, కే, బీ విటమిన్స్, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, జింక్ తో పాటూ యాంటీ-ఆక్సిడెంట్స్, ఇంకా ఆరు గ్రాముల హై క్వాలిటీ ప్రొటీన్ ఉంటాయి.
ప్రోటీన్ వల్లే మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. మజిల్స్ వేర్ ఎండ్ టేర్ ప్రాసెస్‌లో బిల్డ్ అవుతాయి. వెయిట్ ట్రెయినింగ్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ మజిల్స్ యొక్క మైక్రో ఫైబర్‌లో అతి చిన్న టేర్స్కి కారణమౌతాయి. ఈ టేర్స్ హీల్ అయినప్పుడు మజిల్స్ స్ట్రాంగ్‌గా అవుతూ ఉంటాయి. ఈ మొత్తం ప్రాసెస్‌లో ప్రొటీన్స్‌లో ఉండే ఎమైనో ఆసిడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. బాయిల్డ్ ఎగ్స్‌లో కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది. అంటే, మజిల్ బిల్డింగ్‌కి కావాల్సిన తొమ్మిది ఎసెన్షియల్ ఎమైనో ఆసిడ్స్ హార్డ్ బాయిల్డ్ ఎగ్స్‌లో ఉండే ప్రోటీన్ లో ఉంటాయి. అందుకనే, మజిల్ గ్రోత్ కీ, మజిల్ స్ట్రెంత్ కీ హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ అవసరం.
హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ లో ఉండే ప్రోటీన్ వల్ల వచ్చే ఎనర్జీ అతి ఆకలి వేయకుండా కాపాడుతుంది. దీని వల్ల ఎంత అవసరమో అంతే తింటాం. ఆటోమాటిక్‌గా వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. ప్రతి హార్డ్ బాయిల్డ్ ఎగ్‌లోనూ డెబ్భై క్యాలరీలు ఉంటాయి. కానీ, శాచ్యురేటెడ్ ఫ్యాట్ మాత్రం చాలా తక్కువ. బ్రేక్ ఫాస్ట్‌లో రెండు ఎగ్స్ తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది, రోజంతటికీ కావాల్సిన ఎనర్జీ కూడా వస్తుంది.


