గోపీచంద్ ‘ఆక్సిజన్’ ఆలస్యానికి కారణం?
- 79 Views
- wadminw
- January 23, 2017
- Home Slider సినిమా
గోపీచంద్ కథానాయకుడిగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందింది. ఆక్సిజన్ పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసి వుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ సినిమాకి సంబంధించిన విషయాలేవీ బయటికి రావడం లేదు. పనులు ఎంతవరకూ వచ్చాయో విడుదల ఎప్పుడనే సమాచారం ఉండటం లేదు. హీరో గోపీచంద్, దర్శకుడు జ్యోతికృష్ణ మధ్య తలెత్తిన విభేదాలే ఈ సినిమా విడుదల ఆలస్యానికి కారణమని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే ఈ విభేదాలకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగులో గోపీచంద్ పాల్గొంటున్నాడు. తెలుగు తెరపై యాక్షన్ హీరోగా గోపీచంద్‌కి మంచి పేరుంది. యాక్షన్‌కి కామెడీని కూడా కలుపుకుని ఆయన అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. అలాంటి గోపీచంద్ హీరోగా కొంతకాలం క్రితం బలం అనే సినిమా తెరకెక్కింది. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించింది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా కొన్ని కారణాల వలన విడుదలకి నోచుకోలేదు. ఆ సినిమాను ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే సౌఖ్యం వంటి ఫ్లాప్ తరువాత సినిమాగా బలం రిలీజ్ చేయవద్దనీ, తాజా చిత్రం ఆక్సిజన్ తరువాత కొంత గ్యాప్ ఇచ్చి విడుదల చేసుకోమని గోపీచంద్ అంటున్నాడట. మరి నిర్మాతలు తమ నిర్ణయం మార్చుకుంటారో లేదో చూడాలి. మరోవైపు, సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాడై కూడా తమిళంలో మంచి పట్టు సాధించిన హీరో విశాల్. తమిళ్ హీరోగా మంచి గుర్తింపు పొందిన విశాలు తెలుగు వారికి కూడా మంచి సుపరిచితమే. పందెం కోడి, పొగరు లాంటి చిత్రాలతో మంచి యాక్షన్ హీరోగా గుర్తింపు పొందాడు. ఈ సంవత్సరం పల్నాడు చిత్రంతో తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు విశాల్. తాజాగా ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ఒక్కడొచ్చాడు. సురాజ్ దర్శకుడు. నవంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌ను హీరోయిన్ కాజల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ మొదటి వారంలో ఆడియో, నవంబర్లోనే సినిమా కూడా విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. చాలా కాలం తర్వాత స్టార్ కమెడియన్ వడివేలు కొత్త గెటప్‌తో ఐయామ్ బ్యాక్ అంటూ ఎండింగ్ చాలా బాగుంది. విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్, ఎడిటింగ్: ఆర్.కె.సెల్వ, డాన్స్: దినేష్, శోభి, సహనిర్మాత: ఇ.కె.ప్రకాష్, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్.


