గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మహాసభలు
ఖమ్మం: ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రధమ మహాసభను, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యాక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లగుండ్ల రాంబాబు, కంకిపాటి ప్రభాకర్ కోరారు. గురువారం ఖమ్మం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత మొదటిసారిగా ఖమ్మంలోని బైపాస్ నందు రామకృష్ణ ఫంక్షన్హాల్లో మహాసభ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
ఉదయం 11గంటలకు జరిగే ఈ కార్యాక్రమానికి ముఖ్యఅతిధిలుగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ స్టేట్పార్లమెంటరీ కార్యదర్శి(సి.ఎం.ఒ),కొత్తగూడెం శాసనసభ్యులు జలగం వెంకట్రావు, ఖమ్మం శాసనసభ్యులు పువ్వాడ ఆజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం కన్వీనర్ రుద్రగాని ఆంజనేయులు, ఆ సంఘం ఆంద్రప్రదేశ్ రాష్ట్రఅధ్యక్షులు,కె.గణపతిరావు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం.డి.సలీమ్, నాయకులు కె.కృష్ణమూర్తి తోపాటు పలువురు నాయకులు ప్రముఖ వైద్యులు పాల్గొంటారని వీరు తెలిపారు. ఈ కార్యాక్రమానికి జిల్లాలోని గ్రామీణ వైద్యులందరు సకాలంలో హాజరు కావాలని వారు కోరారు.ఈ సమావేశంలో జిల్లా నాయకులు బండి కొమరయ్య, కేతేపల్లి భిక్షమయ్య, బి.నారాయణరావు, అవుకు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


