గ్రేటర్ విశాఖలో స్వచ్ఛ విద్యాలయ ఆదర్శ పాఠశాల పథకం ప్రారంభం
- 102 Views
- wadminw
- October 5, 2016
- రాష్ట్రీయం
విశాఖపట్నం, అక్టోబబర్ 5 (న్యూస్టైమ్): మధురానగర్ జివియంసి పాఠశాలలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ చిద్యాలయ ఆదర్శ పాఠశాల పథకాన్ని యు.ఎస్.ఎయిడ్ ఇండియా మిషన్ డైరక్టర్ మిష్టర్ జొనాధన్ అడ్లిటన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యస్.యం.యస్ (సపోర్ట్ మైస్కూల్) లను పూనె, డెహ్రాడూన్, విశాఖపట్నంలలో 60 ప్రారంభించారని పేర్కొన్నారు.
రెండోవిడతగా బుధవారం మధురానగర్ పాఠశాలలో ప్రారంభించినట్లు వివరించారు. వాటర్ శానిటేషన్ ఫర్ అర్బన్ పూర్ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ విద్యాలయ ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. పాఠశాల స్దాయినుండే మరుగుదొడ్ల వినియోగం, చేతులు కడుగు కొని పరిశుభ్రత పాటించడం, త్రాగునీటి వినియోగం, చేతులు కడగుకొని పరిశుభ్రత పాటించడం, త్రాగునీటి వినియోగం గురించి తెలుసుకోవడంతోబాటు వారి ఇంటిలో తల్లిదండ్రులకు పరిసరాల పరిశభ్రత, నీటి పొదుపు గురించి తెలియజెప్పి పాటించడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. జివియంసి కమిషనర్ హరినారాయణన్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ – స్వచ్చ విద్యాలయ కార్యక్రమం వలన విద్యార్దుల హాజరు పెరిగిందని పేర్కొన్నారు. జివియంసి పరిధిలో 143 పాఠశాలలు ఉన్నాయని వాటిలో 27 ఉన్నత పాఠశాలలని తెలిపారు.
కొన్ని సంస్దలు పాఠశాలలను దత్తత తీసుకొని మౌళిక సదుపాయాలు సమకూరుస్తున్నట్లు వెల్లడించారు. పారిశుధ్య కార్యక్రమ నిర్వహణను యుఎస్ ఎయిడ్ సంస్ద సహకారంతో ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. పై కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో పారిశుధ్యం, త్రాగునీటి సౌకర్యం పెంపొందించినట్లు వెల్లడించారు. మిస్ భాగ్యశ్రీ డెంగ్లె, ప్లాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కార్యక్రమానికి స్వగతం పలికి ప్లాన్ ఇండియా చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు.
ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.క్రిష్ణ మాట్లాడుతూ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉత్తమ అలవాట్లు గురించి వివరించారు. తొలుత స్వచ్చ భారత్ – స్వచ్చ విద్యాలయ ఆదర్శ పాఠశాల ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్దులతో స్వచ్ఛభారత్ – స్వచ్చ విద్యాలయ ప్రతిజ్ఞను నిర్వహించారు. యుఎస్ ఎయిడ్ బృందం తో బాటు జివియంసి కమిషనర్ హరినారాయణన్ విద్యార్దుల కోసం నిర్మించిన మరుగుదొడ్లు, వాటి వినియోగం గురించి స్కూల్ వాష్ టీం విద్యార్దుల నుండి తెలుసుకొన్నారు. కార్యక్రమంలో కోకకోలా ఇండియా డైరక్టర్ మిస్ శుభాశేఖర్, స్దానిక స్వచ్ఛంద సంస్ద జి.యస్.యస, ్ ప్రతినిధి రాము ఎన్.డి.టి.వి, డిప్యూటి ఎడ్యుకేషన్ ఆఫీసర్ సి.ఉషారాణి, పాఠశాల ఉపాధ్యాయని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


