ఘనంగా వీటీ పాఠశాల 70వ వార్షికోత్సవాలు
- 123 Views
- wadminw
- December 22, 2016
- రాష్ట్రీయం
దేశ భవిష్యత్తు నిర్ణయించేది పాఠశాలలేనని ఏయూ విశ్రాంత రెక్టార్, సెంటర్ పాలసీ స్టడీస్ సంచాలకులు ఆచార్య ఏ.ప్రసన్నకుమార్ అన్నారు. రాజేంద్రనగర్‌లోని వి.టి పాఠశాలలో నిర్వహిస్తున్న 70వ వార్షికోత్సవ వేడుకల మొదటి రోజు కార్యక్రమాలను ఆయన జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవిద్యా సముపార్జన అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. అధ్యాపకులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేస్తేనే ఉన్నతమైన మానవ విలువలను తయారు చేయడం సాధ్యపడుతుందన్నారు.
దేశంలో పాఠశాల విద్యా విధానం సరిగా లేదన్నారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించే వి.టి పాఠశాల వంటి పాఠశాలలు దేశంలో అతితక్కువ ఉన్నాయన్నారు.అందిరినీ సత్కరించి, ఆదరించే విశిష్ట సంసృతి విశాఖ వాసులదన్నారు. 70 సంవత్సరాలుగా వి.టి పాఠశాల నిర్వహణలో సహకారం అందిస్తున్న విశాఖ వాసులు మంచి మనసు కలవారన్నారు. విశాఖ గురించి ఇక్కడ సంసృతే చెబుతుందన్నారు. వి.టి పాఠశాల 70వ వార్షికోత్సవం జరుపుకోవడం శుభ పరిణామమన్నారు.
వ్యవస్థాపకులు 125వ జయంతి, పి.ఎన్ రావు పాటశాల బాధ్యతలు చేపట్టి 60 సంవత్సరాలు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి.ఎన్ రావు మాట్లాడుతూ విశాఖకు దైవం ఇచ్చిన బహుమతే ఆచార్య ప్రసన్నకుమార్ అన్నారు. వాక్పటిమ, భాషపై పట్టు ఆయన నుంచి యువతరం నేర్చుకోవాలన్నారు. శాస్త్ర సంబంధ అంశాలపై విశాల అవగాహన, పరిజ్ఞానం ఆయన సొంతమన్నారు.ఇటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని యువతరం ఎదగాలని సూచించారు.
సంస్థ కరస్పాండెంట్ పి.రమణ మాట్లాడుతూ భవిష్యత్ సవాళ్లను స్వీకరించే విధంగా యువతను సిద్దం చేస్తున్నామన్నారు. త్వరలో పాఠశాలలో ఇంగ్లీష్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామాశ్రీన్నరు. అంతర్గత నైపుణ్యాలను గుర్తించి వాటికి పదును పెడుతున్నామన్నారు. సమ్మిళిత విద్యను అందించే దిశగా పాటశాల పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని లక్ష్మి, పద్మ, రమాదేవి, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లి దండ్రులు పాల్గొన్నారు. పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా చిన్నారుల నాట్య ప్రదర్శనలు అలరించాయి. శాస్త్రీయ, పాశ్యాత్య నృత్యాలకు చిన్నారులు చేసిన నృత్యాలు అకట్టుకున్నాయి.
అలరించిన సాంసృతిక కార్యక్రమాలు….
పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా చిన్నారుల నాట్య ప్రదర్శనలు అలరించాయి. శాస్త్రీయ, పాశ్యాత్య నృత్యాలకు చిన్నారులు చేసిన నృత్యాలు అకట్టుకున్నాయి.


