చంద్రబాబును పిచ్చాసుపత్రిలో పెట్టాలి
- 104 Views
- admin
- February 24, 2023
- తాజా వార్తలు
సీఎం జగన్ పై చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని… ఆయనకు బాలకృష్ణ పూనినట్టున్నాడని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గన్నవరంకు పట్టాభిని పంపింది చంద్రబాబేనని ఆరోపించారు. గన్నవరం ఘటనలో టీడీపీ కార్యకర్తలకు చిన్న గీత కూడా పడలేదని చెప్పారు. చంద్రబాబును జైల్లో కానీ లేదా పిచ్చాసుపత్రిలో కానీ పెట్టాలని అన్నారు.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పిచ్చాసుపత్రికి పంపించాల్సిన సమయం ఆసన్నమయిందని కొడాలి నాని అన్నారు. గన్నవరంకు వెళ్లిన చంద్రబాబు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. పోలీసుల గురించి చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. మీ అంతు తేలుస్తానని హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం ముసుగులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు.
Categories

Recent Posts

