చర్మ క్యాన్సర్కు నూతన చికిత్సా విధానం
- 79 Views
- wadminw
- January 8, 2017
- Home Slider అంతర్జాతీయం
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఉన్న క్యాన్సర్లలో మెలనోమా క్యాన్సర్ ఆరవస్థానంలో ఉంది. బ్రిటన్లో మెలనోమా క్యాన్సర్ కారణంగా ఏడాదికి సుమారు 2,000మంది మరణిస్తున్నారు. సూర్యుడు నుంచి ప్రసరించే అత్యంత హానికరమైన యూవీ కిరణాలు శరీరంపై ఉన్న క్యాన్సర్ కణాల పెరుగుదలకు దోహదపడతాయి. వైద్యానికి లొంగని క్లిష్టమైన దశలో ఉన్న చర్మక్యాన్సర్ను పెంబ్రాలైజుమాబ్ అనే చికిత్సా విధానం ద్వారా నియంత్రించవచ్చని ప్రయోగాత్మకంగా ఎర్లీ ఏక్సెస్ టు మెడిసిన్ స్కీమ్ (ఇఏఎమ్ఎస్) వెల్లడించింది.
దీనిని గత ఏప్రిల్లో ఇంగ్లాండ్లో ప్రారంభించారు. ప్రాథమిక దశ దాటిన అనంతరం మెలనోమా క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు కూడా సోకి నివారించలేని పరిస్థితిలో ఈ చికిత్సావిధానం ద్వారా రోగి జీవన స్థితిగతులను కొంతవరకైనా నయం చేయవచ్చని బ్రిటన్లోని క్యాన్సర్ పరిశోధకులు వెల్లడించారు. చర్మక్యాన్సర్ ప్రాథమిక దశలో పెంబ్రాలైజుమాబ్ రక్తనాళాల్లోకి పంపించటంద్వారా కొంతవరకు నియంత్రించవచ్చు. ఈ విధానం ద్వారా మనిషిలోని రోగనిరోధక శక్తి పెంపొందించి తద్వారా క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడేశక్తిని పెంపొందిస్తుంది.
అమెరికాలో ఈ విధానానికి లైసెన్సు ఉన్నప్పటికీ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్నే ఉంది. బ్రిటన్లోని క్యాన్సర్ పరిశోధకురాలు ఎమ్మో గ్రీన్వుడ్ మాట్లాడుతూ పెంబ్రాలైజుమాబ్ చికిత్సావిధానం త్వరలోనే రోగులకు అందుబాటులోకి వస్తుందనీ దీనిద్వారా చర్మక్యాన్సర్ను ఎక్కువశాతం తగ్గించవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


